Trishul News

బాలుడుని తీసుకుని పరారైన వివాహిత..!

- మాయమాటలు చెప్పి బాలున్ని లొంగదీసుకున్న మహిళ
గుడివాడ, త్రిశూల్ న్యూస్ :
ఒక్కోసారి కొన్నికొన్ని ఘటనలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. కొన్ని బంధాలు విన్నప్పుడు నోట మాట రాదు. వయసుతో సంబంధం లేకుండా జరిగే వ్యవహారాలు ముక్కున వేలేసుకునేలా చేస్తాయి.
ఆమె వయసు 28 ఏళ్లు. పెళ్ళై భర్త , ఇద్దరు పిల్లలున్నారు. చక్కగా సాగే జీవితంలో పక్కచూపులు చూసింది. ఆంటీ అంటూ ఇంటికొచ్చే ఎదురింటి కుర్రాడిపై మనసుపడింది. అతడి వయసు 15ఏళ్లు. ఆ బాలుడిలో ఏం చూసిందో ఏమో.. వాడ్ని ముగ్గులోకి దించింది. అంతేకాదు ఈ వయసులో చేయకూడని పనులన్నీ చేయించింది. చివరకు ఓ మంచి రోజు చూసుకొని బాలుడ్ని తీసుకొని వెళ్లిపోయింది. ఊహించని మలుపులు తిరిగిన ఈ స్టోరీ తెలుకున్న పోలీసులకు ఫ్యూజులు ఔటై పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడివాడలో సంచలనం సృష్టించిన మహిళ, బాలుడి మిస్సింగ్ కేసులో మిస్టరీ వీడింది. గుడివాడ పట్టణానికి చెందిన స్వప్న అనే మహిళకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు.
కొంతకాలంగా వారి ఎదురింట్లో ఉండే ఎనిమిదవ తరగతి చదువుతున్న 15ఏళ్ల బాలుడితో చనువుగా ఉంటోంది. స్వప్నకు బాలుడితో ఇద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఉంది. ఈ క్రమంలోనే ఈనెల 19న అతడ్ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తొలుత ఆమె బయటకు వెళ్లిందని కుటుంబ సభ్యులు భావించారు. ఎదురింట్లో బాలుడు కూడా కనిపించకపోవడంతో ఇద్దరూ కలిసి వెళ్లిపోయినట్లు నిర్ధారించుకున్నారు. స్వప్నపై బాలుడి తండ్రి కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఘటన సంచలనంగా మారడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని విచారణ జరిపారు.బాలుడితో స్వప్నకు కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. దీంతో ఇద్దరం కలిసి వెళ్లిపోతే హాయిగా ఉండొచ్చని బాలుడ్ని నమ్మించింది. ఈనెల 19న బాలుడ్ని తీసుకొని వెళ్లిపోయింది. స్వప్న ఫోన్ కాల్ డేటా, సిగ్నల్స్ ను విశ్లేషించిన పోలీసులు.. ఇద్దరి ఫోటోలతో గాలించారు. చివరకు హైదరాబాద్ బాలానగర్ లోని ఓ గదిలో బాలుడితో పాటు స్వప్న ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి ఆమెతో పాటు బాలుడ్ని గుడివాడ తీసుకొచ్చారు. విచారణలో స్వప్న షాకింగ్ విషయాలు చెప్పింది. బాలుడితో కొంతకాలంగా తనకు శారీరక సంబంధం ఉందని.. అతడితో కలిసి శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశంతో మాయమాటలు చెప్పి తీసుకెళ్లిపోయినట్లు అంగీకరించింది. దీంతో స్వప్నపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు బాలుడి ఆచూకీ తెలియడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు స్వప్న వెళ్లిపోవడంతో కంగారుపడ్డ భర్త, పిల్లలు ఊహించని పరిణామంతో షాక్ తిన్నారు. ఇక కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

Post a Comment

Previous Post Next Post