Posts

Showing posts from January, 2024

ఏపీలో నాలుగు పార్టీలు.. రెండు కుటుంబాలు..!

Image
విజయవాడ, త్రిశూల్ న్యూస్ : ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్స్ మొత్తం రెండు కుటుంబాల చుట్టూనే నడుస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే రెండు జాతీయ పార్టీలు..రెండు ప్రాంతీయ పార్టీల పగ్గాలు కేవలం రెండు కుటుంబాల చేతిలోనే ఉండడం బహుశా ఏపీలో ఎన్నడూ చూడని రాజకీయ దృశ్యం. ఏపీ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన జూఖీ వారసుడిని నేనే అంటూ కాంగ్రెస్ హై కమాండ్ ను ధిక్కరించి మరీ సొంత పార్టీతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఏపీ సీఎం జగన్. 151 అసెంబ్లీ సీట్లతో తిరుగులేని మెజార్టీ తో 2019 ఎన్నికల్లో గెలిచి సీఎం అయిపోయారు. ఇప్పుడు వై నాట్ 175 అంటూ మరోసారి ఏపీ లో పవర్ లోకి రావడానికి సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. బలమైన ప్రాంతీయ పార్టీకి ఆయన అధ్యక్షుడు .జూ షర్మిల. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ట్రెండింగ్ పేరు. ఈ నెల 4వ తేదీన కాంగ్రెస్ లో చేరితే 10 రోజుల్లో నే ఏపీ అధ్యక్షురాలు అయిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కి ఊపిరి పోయ్యాలన్నా.. గత వైభవం దిశగా పార్టీ నీ నడపాలన్నా అది షర్మిల వల్లే సాధ్యం అని కాంగ్రెస్ హై కమాండ్ నమ్ముతోంది. దానికి తోడు వైఎస్సార్ పై అభిమానం ఉండి.. జగన్ తో ఇమడ లేక పోతున్న వైసీప...