ఇసుక అక్రమ రవాణా.. 4లారీలు, రెండు ట్రాక్టర్లు స్వాధీనం..!
- వేర్వేరు దాడుల్లో ఐదుగురు అరెస్ట్ నెల్లిమర్ల, త్రిశూల్ న్యూస్ : విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో శనివారం కొండవెళ్లగడ జంక్షన్ , చంపావతి నది, మొయిద జంక్షన్, నెల్లిమర్ల పరిధిలో జరిగిన రూట్ వాచ్ లో జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ శీరపు వెంకటరావు ఆదేశాలు మేరకు ఇన్స్పెక్టర్ జి ఎస్ రాజశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ పి. నాగలక్ష్మి , సిఐ రాజేశ్వరి మరయు సిబ్బంది, ఇంటెలిజెన్స్ సీఐ శేఖర్ బాబు మరియు సిబ్బంది నిర్వహించన రూట్ వాచ్ లో ఇసుక వాహన తనిఖీలు నిర్వహించారు. పోలీసుల తనిఖీలలో 3 లారీలు,1 ట్రాక్టర్ నాలుగు కేసులలో మొత్తం 34.5 టన్నుల ఇసుక సీజ్ చేసి 4 గురిని అరెస్టు చేసి నెల్లిమర్ల లా అండ్ ఆర్డర్ పోలీస్ వారికి అప్పగించారు. నెల్లిమర్ల సబ్ ఇన్స్పెక్టర్ , లా అండ్ ఆర్డర్ వారి తో కలిపి జరిపిన దాడులలో 5 వ కేసులో ఒక్క ట్రాక్టర్ ని (4.5) టన్నుల ఇసుకను సీజ్ చేసి ఒక్క వ్యక్తి ని అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా నెల్లిమర్ల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ జి .ఎస్ .రాజశేఖర్ నాయుడు మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా జరిపే వారిపై దాడులు నిర్వహించి తగు చ...