శ్రీకాకుళం నుండి కుప్పం చేరుకున్న టిడిపి నాయకులు సైకిల్ యాత్ర..!

త్రిశూల్ న్యూస్, కుప్పం :
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిర్దోషిగా జైలు నుండి బయటకు రావాలని కోరుకుంటూ శ్రీకాకుళంకు చెందిన టిడిపి నాయకులు సుందర్ రావు, ఆదినారాయణ, రామకృష్ణ, రామ సూర్య, రమేష్ లు శ్రీకాకుళం నుండి కుప్పం వరకు సైకిల్ యాత్ర నిర్వహించారు. శనివారం కుప్పం చేరుకున్న వీరిని స్థానిక టిడిపి నాయకులు ఘనంగా ఆహ్వానించారు. అలాగే తెలుగు మహిళలు మంగళ హారతులు పట్టి వారికి ఆహ్వానం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ తాము యాత్ర ప్రారంభించినప్పటి నుండి దాదాపుగా యాత్ర సుఖాంతంగా ముగిసింది కానీ, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో మాత్రం తమకు చేదు అనుభవం ఎదురైందని, అక్కడి వైసిపి నాయకులు తమను అడ్డుకోవడంతో పాటు దుర్భసలాడి నానా రభస చేయడం జరిగిందన్నారు. ఇది అధికార పార్టీ అరాచకాలకు నిదర్శనంగా నిలుస్తోందని, ఇలాంటి ఘటనల వల్ల ఆ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని, ముఖ్యంగా పుంగునూరు నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రిగా ఉన్నందున ఆయన సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు జరగడం ఆయనకే అవమానకరమంటూ తెలిపారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు ఇలాంటి దుశ్చర్యలు మానుకోవాలని సూచించారు. అలాగే తమ నాయకుడు త్వరగా జైలు నుండి నిర్దోషిగా బయటకు రావడంతో పాటు పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలో ఆయన సేవలందించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. అలాగే కుప్పం నాయకులు తమ పట్ల చూపిన ప్రేమభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా పుంగునూరులో జరిగిన ఘటన తరువాత కుప్పం టిడిపి నాయకులు తమ వెంట ఉండి తమకు రక్షణగా తమతోపాటు యాత్ర చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, మహిళలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు