Posts

Recent News

సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కుప్పం మున్సిపల్ ఛైర్మన్ డా.సుధీర్..!

Image
- పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన సుధీర్ అమరావతి, త్రిశూల్ న్యూస్ : చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో సుధీర్ టీడీపీ కండువా కప్పుకున్నారు. పార్టీ కండువా కప్పి సుధీర్ ను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీకి, మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసిన అనంతరం సుధీర్ టీడీపీలో చేరారు. చంద్రబాబుతోనే కుప్పం సమగ్ర అభివృద్ధి సాధ్యమని తామంతా నమ్ముతున్నామని సుధీర్ అన్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి నడిచేందుకే అన్ని పదవులకు రాజీనామా చేశానని సుధీర్ తెలిపారు.

నవంబరు 11 నుండి తెలుగు రాష్ట్రాల్లో 'మన గుడి' కార్తీక మాస కార్యక్రమాలు..!

Image
తిరుమల, త్రిశూల్ న్యూస్ : ప‌విత్ర‌మైన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో నవంబరు 11 నుండి 17వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన శివాల‌యాల్లో మనగుడి కార్యక్రమం జరుగనుంది. ఇందులో భాగంగా ఏపీలోని 26 జిల్లాలు, తెలంగాణలోని 33 జిల్లాల్లో జిల్లాకు ఒక‌టి చొప్పున ఎంపిక చేసిన శివాల‌యాల‌్లో 7 రోజుల పాటు కార్తీక‌మాస విశిష్ట‌త‌పై ధార్మికోప‌న్యాసాలు నిర్వ‌హిస్తారు. ఒక్కో జిల్లాలో 2 చొప్పున ఆల‌యాల‌ను ఎంపిక చేసి న‌వంబ‌రు 13న కైశిక ద్వాద‌శి ప‌ర్వ‌దిన కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు. జిల్లాకు ఒక‌టి చొప్పున ఎంపిక చేసిన శివాల‌యాల్లో న‌వంబ‌రు 15న కార్తీక దీపోత్స‌వం కార్యక్రమం చేప‌డ‌తారు.

ఏపీ టెట్ ఫలితాల్లో మెరిసిన విజయనగరం వాసి అశ్విని..!

Image
విజయనగరం, త్రిశూల్ న్యూస్ : ఏపీలో విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన కొండ్రు అశ్విని టెట్ ఫలితాల్లో వంద శాతం మార్కులు సాధించారు. పేపర్-1ఏ(SGT)లో ఆమెకు 150 మార్కులకు 150 మార్కులు వచ్చాయి. 2014-16 మధ్య డైట్ పూర్తి చేసిన ఆమె వరుసగా ఐదు టెట్లకు పోటీపడ్డారు. తల్లిదండ్రులు వెంకటలక్ష్మి, కె.శంకరరావు ప్రోత్సాహంతో డిఎస్సీ సాధించాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు.

పదోతరగతి పరీక్ష ఫీజు గడువు పొడిగింపు..!

Image
అమరావతి, త్రిశూల్ న్యూస్ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువును మరోవారం రోజులు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు దేవానందరెడ్డి తెలిపారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 11 వరకు ఎలాంటి అదనపు చెల్లింపులూ లేకుండా ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉండగా దీన్ని ఈ నెల 18 వరకు పొడిగించారు. అదనపు చెల్లింపు రూ.500తో డిసెంబరు 10వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.

శ్రీకాళహస్తి కాపునాడు అధ్యక్షులుగా గరికిపాటి చంద్రశేఖర్ బాబు నియామకం..!

Image
శ్రీకాళహస్తి, త్రిశూల్ న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గం కాపునాడు అధ్యక్షులుగా గరికిపాటి చంద్రశేఖర్ బాబుని నియమిస్తూ కాపునాడు జాతీయ అధ్యక్షులు గల్లా సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గం కాపునాడు అధ్యక్షులుగా నియమితులైన గరికపాటి చంద్ర శేఖర్ బాబు మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తనపై నమ్మకంతో ఇచ్చిన పదవికి వన్నె తెచ్చేలా కృషి చేస్తానని, కాపు, ఒంటరి, తెలగ, బలిజ సామాజిక వర్గాల అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా కాపు నాడు పెద్దల సహాయ, సహకారంతో కాపు భవన్ నిర్మాణంకై తన వంతు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా కాపు యువతకు, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. త్వరలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని కాపునాడు పెద్దలతో కలిసి కాపు భవన్ నిర్మాణానికి సహాయ, సహకారం కోరుతామన్నారు. కాగా గరికపాటి చంద్ర శేఖర్ బాబుకు పలువురు అభినందనలు తెలిపారు.

ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఉన్మాదులను ఉపేక్షించేది లేదు - ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Image
అమరావతి, త్రిశూల్ న్యూస్ : గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 33వ డివిజన్ పరిధిలోని బ్రాడిపేట 6/20లో టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని, వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవి హెచ్చరించారు. మంగళవారం ఘటన జరిగిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ విగ్రహాన్ని కొంతమంది ఆకతాయిలు మదమెక్కి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. నిన్న ఓ పార్టీకి చెందిన వ్యక్తులు వినాయక విగ్రహం ఊరేగింపు చేశారు. ఇది వారు చేశారా లేక ఆకతాయిలు చేశారా అనేది దర్యాప్తులో తెలియాల్సి ఉంది. దీనికి బాధ్యులైన ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని ఎమ్మెల్యే గళ్ళా మాధవి హెచ్చరించారు. ఎన్టీఆర్ అంటేనే తెలుగుజాతి ఆత్మగౌరానికి ప్రతీక అని, అటువంటి ఎన్టీఆర్ విగ్రహం పైన దాడి జరిగింది అంటే ప్రతి తెలుగు వాడి మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. స్థానికంగా ఉన్న ప్రజలు మరియు సిసి కెమెరాలు ద్వారా ఘటనకు కారణమైన వారిని గర్తించి చర్యలు తీస...

గుంటూరులో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం..!

Image
అమరావతి, త్రిశూల్ న్యూస్ : గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనీ 33వ డివిజన్ పరిధిలోని బ్రాడిపేట 6/20వ అడ్డరోడ్డు వద్ద మాజీ ముఖ్యమంత్రి గౌరవ స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. నిన్న నిన్న రాత్రి వినాయక నిమజ్జనం సందర్భంగా కావాలని కొంతమంది వ్యక్తులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న టిడిపి నేతలు విగ్రహం వద్దకు చేరి నిరసన వ్యక్తం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పనరావతం కాకుండా చూడాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.