నవంబరు 11 నుండి తెలుగు రాష్ట్రాల్లో 'మన గుడి' కార్తీక మాస కార్యక్రమాలు..!

తిరుమల, త్రిశూల్ న్యూస్ :
ప‌విత్ర‌మైన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో నవంబరు 11 నుండి 17వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన శివాల‌యాల్లో మనగుడి కార్యక్రమం జరుగనుంది. ఇందులో భాగంగా ఏపీలోని 26 జిల్లాలు, తెలంగాణలోని 33 జిల్లాల్లో జిల్లాకు ఒక‌టి చొప్పున ఎంపిక చేసిన శివాల‌యాల‌్లో 7 రోజుల పాటు కార్తీక‌మాస విశిష్ట‌త‌పై ధార్మికోప‌న్యాసాలు నిర్వ‌హిస్తారు. ఒక్కో జిల్లాలో 2 చొప్పున ఆల‌యాల‌ను ఎంపిక చేసి న‌వంబ‌రు 13న కైశిక ద్వాద‌శి ప‌ర్వ‌దిన కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు. జిల్లాకు ఒక‌టి చొప్పున ఎంపిక చేసిన శివాల‌యాల్లో న‌వంబ‌రు 15న కార్తీక దీపోత్స‌వం కార్యక్రమం చేప‌డ‌తారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు