Trishul News

అమృత్ సరోవర్ పనులకు అత్యంత ప్రాధాన్యత..!

- చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్
చిత్తూరు, త్రిశూల్ న్యూస్ :
చిత్తూరు జిల్లాలో జలజీవన్ మిషన్ కింద మరో 40 వేల కనెక్షన్లు మాత్రమే ఇవ్వాల్సి ఉందని 2023 మార్చినాటికి పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ అన్నారు. గురువారం సాయంత్రం పంచాయతీరాజ్ సెక్రటరీలు గోపాలకృష్ణ ద్వివేది, కోన శశిధర్ లు రాష్ట్రంలో జరుగుతున్న భవనాలు, అమృత్ సరోవర్  పనులు, జలజీవన్ మిషన్ పనులు, స్వచ్ఛ సంకల్ప పథకం పనుల గురించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 3.78 లక్షల వాటర్ కనెక్షన్లను ఇవ్వడం జరిగిందని మరో 570 టెండర్లను పిలవాల్సి ఉందని దీని ద్వారా జిల్లాకు సంబంధించి 40వేల వాటర్ కనెక్షన్లను ఇవ్వాల్సి ఉందని వచ్చే మార్చి నాటికి పూర్తి చేస్తామని దీని ద్వారా ప్రతి ఇంటికి నీటి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత క్రమంలో సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు ,వైయస్సార్ హెల్త్ క్లినిక్ లు, నిర్మాణాలు అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవడం జరిగిందని ఈ నిర్మాణాలను వేగవంతం చేయాలని మరో 60 రోజులు మాత్రమే మిగిలి ఉందని వెంటనే పూర్తి చేసేలా చూడాలని అన్నారు. ఇంకా ప్రారంభించాల్సినవి వచ్చే వారంలోగా ప్రారంభించాలని ఆ విధంగా సంబంధిత శాఖల వారిని ఆదేశించాలని జిల్లా కలెక్టర్లను కోరారు. అదేవిధంగా అమృత్ సరోవర్ పనులను అత్యంత ప్రాధాన్యత క్రమంలో తీసుకోవాలని జూలై 15 నాటికి 20 శాతం పనులను పూర్తి చేయాలని ఉదయం 9 గంటల సమయంలో సంబంధిత ప్రాజెక్ట్ డైరెక్టర్లు పనులు జరుగుతున్న ప్రాంతం నుంచి వీడియో కాల్ చేసి చూపాలని అన్నారు. ఈ పనులను కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా 2023 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని అన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం సక్రమంగా అమలు చేయాలని ఈ కార్యక్రమాలు అమలు చేస్తే గ్రామాలలో పారిశుద్ధ్య పనులు కానీ ఇతర ఇబ్బందులు కానీ ఉండవని అన్నారు. అదేవిధంగా ఏఎంసీయులు, బి ఎం సి యు లు స్థల సేకరణ పూర్తి చేసుకుని పనులను ప్రారంభించాలని అన్నారు. కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్ ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. డిజిటల్ లైబ్రరీలను వేగంగా పూర్తి చేసి ఆచరణలోకి తీసుకురావాలని అన్నారు. నిర్మాణాలకు సంబంధించి ఏవైనా కోర్టు సమస్యలు ఉంటే తప్ప మిగతా అన్ని ప్రాంతాలలోనూ నిర్మాణాలను వేగవంతంగా ప్రారంభించి పూర్తి చేయాలని అన్నారు. అదేవిధంగా బిల్లులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసి మంజూరు పొందాలని అన్నారు. జల జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని నిర్దేశించిన సమయంలో పనులను పూర్తి చేయాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో డ్వామా పీడీ చంద్రశేఖర్, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ వెంకటరమణ, పంచాయతీరాజ్ ఎస్ఇ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Post a Comment

Previous Post Next Post