ఓకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి..!
ఆళ్లగడ్డ, త్రిశూల్ న్యూస్ :
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి ఆసుపత్రిలో (శివమ్మ ఆసుపత్రి) మంగళవారం ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన ఆవుల స్వప్న అనే గర్భిణీ స్త్రీ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈరోజు పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన స్వప్నకు డాక్టర్ మాధురి డాక్టర్ హనీషా, డాక్టర్ యశ్వంత్ రెడ్డి డాక్టర్ల బృందం ఆమెకు నార్మల్ డెలివరీ ద్వారా కాన్పు చేశారు. అనంతరం మొత్తం ఇద్దరు మగపిల్లలు, ఓక ఆడపిల్లకు తల్లి జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డలు ఆసుపత్రిలో ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులకు స్వప్న కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వెంకటసుబ్బారెడ్డి హాస్పిటల్ ఎండీ డాక్టర్ సారెడ్డి నరసింహారెడ్డి, డాక్టర్ శివ నాగేశ్వరమ్మ , ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment