Trishul News

పాఠశాలల్లో నాడు నేడు పనులు ప్రక్రియను వేగవంతం చేయాలి..!

- జగనన్న విద్యా కానుక వెంటనే అందించే ఏర్పాటు చేయాలి

- జగనన్న గోరుముద్దలో నాణ్యతలను పాటించాలి

- బయోమెట్రిక్ హాజరు శాతం పెంచాలి

- జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్ 
చిత్తూరు, త్రిశూల్ న్యూస్ :
నాణ్యమైన విద్యను అందించేందుకు చక్కటి వసతి ఉండాలని పాఠశాల పరిసరాలను చక్కగా తీర్చిదిద్దేందుకు నాడు నేడు కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేయాలని, జగనన్న విద్యా కానుకలను వెంటనే అందించాలని, గోరుముద్ద కార్యక్రమంలో నాణ్యతలను పాటించాలని బయోమెట్రిక్ హాజరు 100% ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ అన్నారు. జిల్లా కలెక్టర్ సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం ద్వారా ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులు ఎంఈఓలు, మండల ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1094 పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమాన్ని చేపట్టేందుకు నిర్ణయించారని ఇప్పటివరకు 1029 పాఠశాలలలో సాంకేతికపరమైన అనుమతులు ఇవ్వడం జరిగిందని మిగతా కార్యక్రమాలు వెంటనే పూర్తి చేయాలని అన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత గల ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని విద్యా కమిటీ, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, వెల్ఫేర్ అసిస్టెంట్ తరచూ తనిఖీలు నిర్వహించాలన్నారు. జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో నాణ్యత గల ఆహారం అందించేలా చూడాలని ఆదేశించారు. విద్యా కానుకలను వెంటనే పాఠశాలలకు అందజేయాలని ఇప్పటివరకు 123 పాఠశాలలకు మాత్రమే పూర్తిస్థాయిలో అందించారని 2352 పాఠశాలలకు వెంటనే అందించే కార్యక్రమం చేపట్టాలని అన్నారు. జిల్లాలో బయోమెట్రిక్ హాజరు 98% ఉందని, హాజరు శాతం 100 ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, డీఈవో పురుషోత్తం, మెప్మా పీడీ రాధమ్మ, ఏపీసి వెంకటరమణారెడ్డి, నాడు నేడు కార్యక్రమం ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post