Trishul News

పరిశుద్ధమైన నీటి సరఫరాకు నిరంతర పర్యవేక్షణ - కమిషనర్ హరిత

నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
నగర వ్యాప్తంగా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల ద్వారా అందిస్తున్న మంచినీటి సరఫరా పరిశుద్ధంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని ఇరిగేషన్, ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ హరిత ఆదేశించారు. సంగం మండలం మహమ్మదాపురంలోని మంచినీటి శుద్ధి కేంద్రాన్ని అధికారులతో కలిసి కమిషనర్ మంగళవారం పరిశీలించారు. పెన్నానది నుంచి నీటిని సేకరిస్తున్న కేంద్రంలోని 122 ఎమ్.ఎల్.డి సామర్ధ్యం గల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మరియు ఇన్ టేక్ వెల్ ను పరిశీలించిన కమిషనర్ వివిధ విభాగాల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీటి శుద్ధత ప్రమాణాలను వంద శాతం పాటించాలని, నగరానికి మంచినీటి సరఫరాలో ఏలాంటి అంతరాయం కలుగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి శుద్ధతకు అవసరమైన క్లోరినైజేషన్, ఇతర పద్ధతులను క్రమంతప్పకుండా పాటించాలని కమిషనర్ ఆదేశించారు. నగర వ్యాప్తంగా వివిధ డివిజనుల్లో జరుగుతున్న వాటర్ ట్యాంకుల మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేసి మంచినీటి సరఫరాను ప్రజలకు అందుబాటులోకి తేవాలని కమిషనర్ సూచించారు. నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న కంపోస్ట్ యార్డులను పర్యావరణ పరిరక్షణ హితంకోసం వికేంద్రీకరణ జరిపే కార్యక్రమాలను వేగవంతం చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ డిఈ తిరుమలరావు, ఈ.ఈ ఆలీ, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ సంపత్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post