Trishul News

ఆదర్శ హరిత నగరంగా తీర్చిదిద్దుదాం- మేయర్ పి. స్రవంతి

నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
జగనన్న హరిత నగరాలు కార్యక్రమం అమలులో భాగంగా నగర వ్యాప్తంగా మొక్కలు నాటి, వాటి సంరక్షణతో ఆదర్శ నెల్లూరు హరిత నగరాన్ని తీర్చిదిద్దుదామని నగర పాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతి ఆకాంక్షించారు. హరిత నగరాలు కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్థానిక రూరల్ నియోజకవర్గం 2వ డివిజన్ పెద్ద చెరుకూరు ప్రాంతంలో మొక్కలను నాటి సంరక్షణా బాధ్యతలను స్థానికులకు అప్పగించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యాన్ని సాధించేందుకు, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన జగనన్న హరిత నగరాలు కార్యక్రమాన్ని నగర వ్యాప్తంగా విజయవంతం చేయాలని సూచించారు. పర్యావరణ హితానికై జాతీయ హరిత ట్రిబ్యునల్ నిర్దేశించిన మార్గదర్శకాలను ప్రతిఒక్కరూ ఆచరించేలా చైతన్యం కలిగించాలని తెలిపారు. నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించడానికి అవసరమైన అన్ని చర్యలను పటిష్టంగా చేపట్టాలని అధికారులను మేయర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ హరిత, వైఎస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కార్పొరేటర్లు జానా నాగరాజు, రామ్ మోహన్ రావు, నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, ఎస్.ఈ సంపత్ కుమార్, ఉద్యాన శాఖ ఏ.డి ప్రదీప్, డి.ఈ లు శేషగిరిరావు, సురేష్, సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post