Trishul News

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రమాణం..!

న్యూఢిల్లీ, త్రిశూల్ న్యూస్ :
భరత దేశ సుప్రీం కోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధనుంజయ్‌ యశ్వంత్‌ చంద్రచూడ్‌ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రితో పాటు, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో ఈ కార్యక్రమం సాగింది. 44 ఏళ్ల క్రితం తండ్రి జస్టిస్‌ యశ్వంత్‌ విష్ణు చంద్రచూడ్‌ ప్రధాన న్యాయమూర్తిగా సుదీర్ఘ కాలం పని చేస్తే, ఇప్పుడు ఆయన తనయుడు అత్యున్నత పీఠాన్ని అధిరోహించడం భారత న్యాయవ్యవస్థలో తొలిసారి. కొత్త ప్రధాన న్యాయమూర్తి ఈ పదవిలో సరిగ్గా రెండేళ్లు కొనసాగుతారు.

Post a Comment

Previous Post Next Post