Trishul News

ఓడిపోతామనే భయంతో జగన్ అరాచకాలు చంద్రబాబు

- వైసీపీ శకం ముగిసిందన్న చంద్రబాబు
కుప్పం, త్రిశూల్ న్యూస్ :
కుప్పంలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలు, అడ్డుకోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. జగన్ కు ఓడిపోతామనే భయం పట్టుకుందని. ఇక జగన్ శకం ముగుస్తుందని చెప్పుకొచ్చారు. పోలీసులతో వాగ్వాదం అనంతరం కుప్పంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు కన్నెర్ర చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో జగన్ లాంటి సైకో సీఎంను చూడటం ఇదే తొలిసారి అని అన్నారు. తన సొంత నియోజకవర్గమైన కుప్పంకు వెళ్లడానికి అనుమతి ఇవ్వకపోవడంపై పోలీసులను నిలదీశారు. పక్షపాతం ఎందుకని, అందరికి ఒకే రూల్ ఉండాలని పోలీసులను నిలదీశారు. తాను కుప్పం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని..ఈరోజు కార్యక్రమాలకు సంబంధించి డీజీపీ, జిల్లా ఎస్పీకి పంపించామన్నారు. తాము ఏ కార్యక్రమం చేయకుండా కుట్రపూరితంగా వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ వన్ తెచ్చిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ రెడ్డికి ఓడిపోతామనే భయం పట్టుకుంది..!
తెలుగుదేశం సభలకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తుండటంతో జగన్ కు ఓడిపోతామనే భయం పట్టుకుందన్నారు. త్వరలో ఇక జగన్ శకం ముగుస్తుందని చంద్రబాబు జోస్యం చెప్పారు. ఇప్పుడు జగన్ చేస్తున్నట్టుగానే గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసుంటే జగన్ పాదయాత్ర చేయగలిగేవాడా అని చంద్రబాబు ప్రశ్నించారు. పోలీసులు చట్టపరిధిలో విధులు నిర్వర్తించాలి కానీ ఏ పార్టీకి కొమ్ము కాయొద్దన్నారు. కుప్పంలోకి ఎందుకు రానివ్వలేదే లేఖ ఇవ్వాలని పోలీసులను కోరారు చంద్రబాబు. ఏ చట్టం ప్రకారం జీఓ నంబర్ 1 తీసుకువచ్చారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మినహాయించబడిందని 1946 సవరణలో దాని ప్రస్తావన లేదని గుర్తు చేశారు. దీనిపై జగన్ సమాధానం చెప్పాలన్నారు.

లాఠీచార్జ్ చేసినా, నిర్బంధాలు పెట్టినా.. ముందుకే !
ఉదయం నుంచి కుప్పంలో హైటెన్షన్ నెలకొంది. పోలీసులు లాఠీచార్జ్ చేసినా, నిర్బంధాలు పెట్టినా చంద్రబాబుకు కుప్పం టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు అక్కడ్నుంచి రోడ్డు మార్గం ద్వారా కుప్పం నియోజకవర్గంలోని పెద్దూరుకు చేరుకున్నారు. కర్ణాటక సరిహద్దులో వేల మంది టీడీపీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికారు. భారీ క్రేన్ సాయంతో గజమాల వేశారు. కుప్పం నుంచి శాంతిపురానికి చంద్రబాబు టీడీపీ ప్రచార రథంపై వెళ్లాల్సి ఉండగా, ఆ వాహనాలను పోలీసులు అడ్డుకొని స్టేషన్ కు తరలించారు. నాలుగు ప్రచార రథాలు, మైకులు వాడవద్దని తేల్చి చెప్పేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
శాంతిపురం మండలం కేనుమాకులపల్లిలో ఏర్పాటు చేసిన స్టేజ్ను తొలగించడంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు వాగ్వాదం నెలకొంది. అదికాస్తా తోపులాటకు కారణమైంది. అడ్డుగా ఉంచిన బారికేడ్లను కూడా టీడీపీ కార్యకర్తలు ఎత్తిపడేశారు. టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయగా, పలువురికి గాయాలయ్యాయి. చంద్రబాబు పర్యటన కోసం కుప్పం నుంచి శాంతిపురానికి వెళ్లాల్సిన టీడీపీ ప్రచార రథాన్ని, వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతిపురం మండలం కెనుమాకులపల్లిలో ఏర్పాటు చేసిన స్టేజ్ ను సైతం పోలీసులు తొలగించారు. పోలీసులతో చాలాసేపు వాగ్వాదం చేసినా కూడా రోడ్ షోకు అనుమతి ఇవ్వకపోవడంతో చంద్రబాబు పాదయాత్రగా పెద్దూరు గ్రామానికి వెళ్లారు. ప్రస్తుతం ఇంటింటికీ వెళ్లి గ్రామంలో ప్రజలను కలుస్తున్నారు. తన ప్రచార రథాన్ని తిరిగి తనకు అప్పగించే వరకు పెద్దూరులో ధర్నా చేయాలని నిర్ణయించారు. చట్టాలతో తన పర్యటనను ఎవరూ ఆపలేరని నాయుడు తేల్చి చెప్పారు.

Post a Comment

Previous Post Next Post