Trishul News

కాణిపాక ఆలయంలో ముగ్గురు అర్చకులు సస్పెండ్..!

- మెమో జారీ చేసిన ఆలయ ఈవో
కాణిపాకం, త్రిశూల్ న్యూస్ :
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వరుస వివాదాలతో సతమతం అవుతోంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. తీవ్ర విమర్శల నేపథ్యంలో.. కాణిపాకం ఆలయంలో ప్రక్షాళణ దిశగా అడుగులు వేస్తున్నారు ఆలయ అర్చకులు. అవినీతికి.. అవకతవకలకు పాల్పడుతున్న కొందరు అర్చకులు.. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్న సిబ్బందిపై వేటు వేశారు. అనుబంధాలయమైన ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో ఉప ప్రధాన అర్చకులు, ఒక ముఖ్య అర్చకులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేసారు ఈవో వెంకటేష్. కాణిపాకం ఆలయంలో అర్చకుల వ్యవహార శైలి రోజుకు ఒక విధంగా వివాదాస్పదంగా మారుతుండడంపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ ఆంజనేయ స్వామి వారి అర్చకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన, ఆలయ ఈవో మండిపడ్డారు. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అర్చకులను కానుకలు పళ్లెంను పెట్టకూడదు అనే నింబంధన ఉంది. అధికారులు.. అర్చకుడి మధ్య జరిగిన వివాదానికి ఆంజనేయ స్వామి వారికి జరిపించాల్సిన అభిషేక కార్యక్రమాన్ని ఆపేసి ఇంటికి వెళ్లిన ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం అనుబంధం ఆలయమైన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రతి మంగళవారం స్వామివారికి జరిగే ప్రత్యేక అభిషేకం ను నిర్వహించకుండా, ఆంజనేయ స్వామి వారి ఆలయ అర్చకులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఆలయం వద్ద కానుకలు తట్టను పెట్టొద్దు అన్న అందుకే స్వామివారికి నిర్వహించే, అభిషేక సేవను నిర్వహించకుండా నిలిపేసినట్లు ఆలయ ఈవో వెంకటేశు తెలిపారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ప్రధాన అనుబంధాలయమైన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది ఈ ఆలయంలో ఉప ప్రధాన అర్చకులు, ఒక ముఖ్య అర్చకులు, ఒక పరిచారిక, అర్చకులు షిఫ్ట్లు వారిగా ఉదయం నుండి రాత్రి వరకు నిధులు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో విధులు నిర్వహించే అర్చకులు భక్తుల నుండి హారతి పళ్లెం ద్వారా వచ్చే కానుకలను స్వీకరిస్తుంటారు. అయితే దేవాదాయశాఖ నిబంధనల మేరకు భక్తుల నుండి హారతి పల్లెం ద్వారా వచ్చే కానుకలను అర్చకులు స్వీకరించకుండా ఆలయ అధికారులు కట్టడి చర్యలు చేపట్టారు. ఆలయంలో పనిచేసే ముఖ్య అర్చకుడు, పరిచారిక అర్చకుడు, ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి దేవాలయంలో ఉదయం 5, గంటల నుంచి 5,45 గంటల నిమిషాల వరకు ప్రత్యేక అభిషేకం నిర్వహించకుండా నిలిపివేసినట్లు ఆలయ ఈవో వెంకటేష్ తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ చేసి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, ముందుగా ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం ఉదయం అభిషేకం చేయని అర్చకులకు మెమో ఇచ్చి, కొంత గడువు ఇచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి అర్చకులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ దానిపై సంజాయిషీ సరిగా లేనందున, వైదిక కమిటీ తో చర్చించి అనంతరం వారిపై చర్యలు తీసుకుంటున్నట్టు తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఈవో వెంకటేష్ తెలిపారు. ఉప ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు అర్చకుడి ఆవేదన తనను అన్యాయంగా తాత్కాలికంగా విధుల నుంచి ఈవో తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు..గతంలో మంగళవారం రోజున ఆంజనేయస్వామి వారికి అభిషేకం చేయనందుకు విధుల నుంచి తొలగించారని ఆరోజు అభిషేకం నా డ్యూటీ కాదని తనతోపాటు ఇంకొక అర్చకులు ఉన్నారని ఆ డ్యూటీ తనదని నాకు దానికి ఎటువంటి సంబంధం లేదని అప్పటి డ్యూటీలో ఉన్న అర్చకులు హరీష్ స్వామి అనే వ్యక్తిని తెలిపారు. తన డ్యూటీ టైం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు మాత్రమే అని శ్రీనివాసాచార్యులు తెలిపారు. గతంలో శ్రీనివాస ఆచార్యులు వారి అనారోగ్య కారణంగా గతంలో ఉన్న ఆలయ ఈవో పూర్ణచంద్రరావు కు మెడికల్ సర్టిఫికెట్తో తన డ్యూటీ టైం మార్చుకున్నట్లు చెప్పారు.. కేవలం అభిషేకం జరగలేదనే కారణంగా తనను సస్పెండ్ చేయడం అన్యాయమని ఒకవేళ స్వామివారి అభిషేకం జరగలేదని తనకు తెలియజేసి ఉంటే వచ్చి అభిషేకం చేసేవారిని అని ఈ సస్పెండ్ వెనుక పెద్ద కుట్ర జరుగుతుందని ఈ మొత్తానికి ఈవో బాధ్యులని ఆవేదన వ్యక్తం చేశారు.

Post a Comment

Previous Post Next Post