ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హుషార్, జనసేనకు చిగురించిన ఆశలు..!
అమరావతి, త్రిశూల్ న్యూస్ : ముసుగు తీసేయండి, కలసి పోటీ చేస్తామని ధైర్యంగా చెప్పండి అంటూ వైసీపీ నేతలు ఇటీవల సవాళ్లు విసిరారు..! ఇప్పుడు జనసేనకు టైమ్ వచ్చింది. కలిసే వస్తామని జనసేనాని ధైర్యంగా చెబుతారా?,వేచి చూస్తారా అనేది తేలాలి..? ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ప్రభావం భవిష్యత్ రాజకీయాలపై స్పష్టంగా కనపడే అవకాశముంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకంగా మూడు స్థానాలు గెలిచిన టీడీపీ హుషారుగా ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేకతను చీలిపోకుండా చేయగలిగితే ప్రతిపక్షాలకు స్కోప్ ఉందనే నమ్మకం జనసేనకు వచ్చింది. పొత్తులపై అటు ఇటు ఆలోచిస్తున్న ఈ రెండు పార్టీలు ఇప్పుడు హుషారుగా జతకలిసే సమయం వచ్చింది. ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే టైమ్ ఉన్నా.. పొత్తులు ఇంకా ఖరారు కాలేదు. వైసీపీ సింగిల్ గా పోటీ చేస్తామని ఇదివరకే చాలాసార్లు చెప్పింది. దమ్ముంటే ఒంటరిగా రండి 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పండి అంటూ సవాళ్లు విసురుతున్నారు వైసీపీ నేతలు. వారు రెచ్చగొట్టినా టీడీపీ, జనసేన, బీజేపీ మాత్రం విడివిడిగా ఎన్నిసీట్లలో పోటీ చేస్తామనే విషయాన్ని చెప్పలేకపోతున్నాయి. బీజేపీ ఇంకా జనసేనతో పొత్తులోనే ఉన్నామ