కుప్పంలో ప్రాణం తీసిన అక్రమ సంబంధం..!

కుప్పం, త్రిశూల్ న్యూస్ :
చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ప్రాణం తీసిన వివాహేతర సంబంధం. భార్యాభర్తల మధ్య తరచూ ఘర్షణనలతో అనుమానస్పద స్థితిలో చిన్నమ్మ మృతి చెందింది. వివరాలోకి వెళితే కుప్పం మండలం ఎన్ కొత్తపల్లి పంచాయతీ నిమ్మకంపల్లిలో దారుణం. చిన్నమ్మ భర్త వెంకటేష్ ప్రియుడు ఆనంద్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. కుప్పం మండల పరిధిలోని ఎన్ కొత్తపల్లి పంచాయతీ నిమ్మకంపల్లి సమీపంలో నివాసముంటున్న వెంకటేష్ కు భార్య చిన్నమ్మ ముగ్గులు సంతానం కాగా కుమార్తెకు వివాహం చేయగా చిన్నమ్మ ఆనంద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న నేపథ్యంలో పలుమార్లు భార్యాభర్తలు గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి చిన్నమ్మతో పాటు ఆనంద్ ను పెద్ద మనుషులు మందలించారని తెలిసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం భార్యాభర్తలు మళ్లీ గొడవపడడంతో చిన్నమ్మను వెంకటేష్ చితకబాదాడు ఇదే విషయమై చిన్నమ్మ గ్రామ పెద్దలకు తెలిపితే పొద్దున్న మాట్లాడుకుంటామంటూ సర్ది చెప్పి పంపించారు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ శనివారం ఉదయం కల్లా చిన్నమ్మ ఇంట్లో మృతి చెంది ఉండగా తన భార్య మృతి చెందిందంటూ భర్త వెంకటేష్ స్థానికులకు తెలుపగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించి చిన్నమ్మ భర్త వెంకటేష్ ప్రియుడు ఆనంద్ తోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు....

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు