Posts

Showing posts from March, 2024

లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్..!

Image
 - కాసేపట్లో ఢిల్లీకి తరలింపు - అధికారులు తో వాగ్వివాదం చేసుకున్న కెటిర్ హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ : బీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ కేసులో కవితకు సెర్చ్ వారెంట్‌తో పాటు అరెస్ట్ వారెంట్‌నూ జారీ చేశారు అధికారులు. ఆమె రెండు ఫోన్లనూ స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని కవిత నివాసం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కవిత నివాసానికి భారీగా చేరుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఈడీ దాడులకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు ధర్నాకు దిగాయి. కేంద్రం, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సౌత్ గ్రూప్‌కు కవిత నేతృత్వం వహించారనేది ప్రధాన ఆరోపణ. అసలు జరిగింది ఇది..! ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఏడాది గ్యాప్‌ తర్వాత ఎమ్మెల్సీ కవితకు గత నెలలో సీబీఐ నోటీసులు ఇచ్చింది. 2022 డిసెంబర్‌లో కవిత నివాసంలోనే స్టేట్‌మెంట్ తీసుకున్న సీబీఐ.. గత నెల 26న ఢిల్లీకి రావాలని, తమ ఎదుట విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో కవితను నిందితురాలిగా చేర్చి 41-A కింద నోటీసులు ఇచ్చింది సీబీఐ. లిక్కర్ కేసులో కీలక నిందితులు అప్రూ...

లోక్‌సభ, శాసనసభ అభ్యర్థులుగా భార్యాభర్తలు..!

Image
అమరావతి, త్రిశూల్ న్యూస్ : రానున్న ఎన్నికల్లో తెదేపా తరఫున భార్యాభర్తలు పోటీలో నిలవనున్నారు. ఇటీవల వైకాపా నుంచి తెదేపాలో చేరిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని.. అదే లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కోవూరు అసెంబ్లీ స్థానానికి ఎంపిక చేశారు. తెదేపాలో తొలిసారిగా భార్యాభర్తలకు లోక్‌సభ, శాసనసభ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. 2009 ఎన్నికల్లో తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ నుంచి కొత్తకోట దయాకర్‌రెడ్డి, దేవరకద్ర నుంచి ఆయన భార్య సీతా దయాకర్‌రెడ్డి తెదేపా తరఫున పోటీచేసి గెలిచారు.

రేపు మధ్యాహ్నం 3గంటలకు లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటన..!

Image
న్యూడిల్లి, త్రిశూల్ న్యూస్ : రేపు మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. రేపు సీఈసీ ప్రెస్‌మీట్‌ పెట్టనుంది. ఈ ప్రెస్‌మీట్‌ అన్ని సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో లైవ్‌స్ట్రీమింగ్‌ అవ్వనుంది. ప్రతి రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై జాతీయ సర్వేను పూర్తి చేసిన ఈసీ తాజాగా జమ్ముకశ్మీర్ పర్యటనతో తన సర్వేను ముగించింది. 543 లోక్‌సభ స్థానాలకు జరిగే ఎన్నికలకు ప్రాంతీయ, జాతీయ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించడం ప్రారంభించాయి. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇప్పటివరకు 267 మంది అభ్యర్థులతో రెండు జాబితాలను విడుదల చేయగా, కాంగ్రెస్ రెండు జాబితాల్లో 82 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇక తాజాగా ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సంధు బాధ్యతలు స్వీకరించారు.

మాజీ సీఎం కేసీఆర్ ను భువనగిరి ఎంపీ టికెట్ కోరిన శ్రీకాంత్ చారి తల్లి..!

Image
భువనగిరి, త్రిశూల్ న్యూస్ : భువనగిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం తనకు ఇవ్వాలని అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కోరారు. గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద తన తనయుడు శ్రీకాంతా చారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఎవరూ టికెట్ ఇవ్వకపోతే ఇండి పెండెంట్ గా పోటీ చేస్తాన న్నారు. పార్టీలు తనపై పోటీకి అభ్యర్థులను నిలబెట్టకూడదని కోరారు. బిఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని కేసీఆర్ ను కోరానని ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన అమర వీరుల కుటుంబాలకు పదేళ్లయినా న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం వెయ్యిమంది అమరులయ్యారని, వారిలో తన కొడుకు కూడా ఒకరని శంకరమ్మ చెప్పారు. వారి కుటుంబాలకు ఎలాంటి  పదవులు లభించలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేయనివారు మాత్రం మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యారని విమర్శిం చారు.

గుర్రంకొండ బస్టాండులో గుర్తుతెలియని వృద్ధుడు గుండెపోటుతో మృతి..!

Image
పీలేరు, త్రిశూల్ న్యూస్ : అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం లోని గుర్రంకొండ ఆర్టిసి బస్టాండ్ వద్ద శుక్రవారం ఉదయం ఓ గుర్తు తెలియని వృద్ధుడు గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికులు గుర్తించి వెంటనే గుర్రంకొండ పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే బస్టాండ్ వద్దకు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. విచారణ చేపట్టి అతని ఆచూకీ లభించకపోవడంతో పంచనామా అనంతరం పోస్ట్ మార్టం కోసం, వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చరీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఆలోచించి ఓటు వేయండి.. అభివృద్ధి చేశాను - అభినయ్ రెడ్డి

Image
తిరుపతి, త్రిశూల్ న్యూస్ : తిరుపతిలోని సిద్దార్థ ఎడ్యుకేషనల్ అకాడమీ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్  ఉపాధ్యాయులు మరియు విద్యార్ధులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ చదువు చెబుతున్న గురువులు, చదువుకుంటున్న విద్యార్థులైన మీరు అభివృద్ధిని ఇష్టపడతారు. అందుకే తిరుపతిని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశాను. నగరం రూపురేఖలు ఏవిధంగా మారిపోయాయో మీరే చూస్తున్నారు. అందుకే స్థానిక ఎమ్మెల్యే వారసుడిగా ఓట్లు అడిగేందుకు నేను రాలేదు.. నేను చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయండని అడగడానికి వచ్చానని పేర్కొన్నారు. ఇక్కడే పుట్టి, పెరిగిన వాడిగా నా తిరుపతి అభివృద్ధి చెందాలనే సంకల్పంతో అహర్నిశలు శ్రమిస్తున్నాను. ఇందులో భాగంగా ముందుగా మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాను. ఇప్పటికే 20 మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించి ట్రాఫిక్ కష్టాలు తీర్చాము. భవిష్యత్తులో మరో 14 మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే మీలాగా చదువుకున్న యువత ఉద్యోగాల కోసం ఇతర నగరాలకు వలస వెళ్లకుండా ఉండేంద...

తల్లిపాలలో ప్లాస్టిక్ రేణువులు.. శరీరభాగాలపై తీవ్రప్రభావం.. సర్వే షాకింగ్ రిపోర్ట్

Image
త్రిశూల్ న్యూస్ డెస్క్ : ప్లాస్టిక్ మన రెగ్యులర్ లైఫ్‎లో ఒక భాగం అయిపోయింది. ఇంటా బయట ఎక్కడైనా ప్లాస్టిక్ వినియోగం తప్పనిసరి అయింది. వాటర్ బాటిల్, టీ కప్, ప్లేట్ ఇలా ఏదైనా ప్లాస్టిక్‎తో ముడిపడింది. మనిషి శరీరంపై ప్లాస్టిక్ ప్రభావం అంశంపై చేసిన తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మన లైఫ్‎లో ప్లాస్టిక్ ఒక భాగం అయిందని మనం అనుకుంటున్నాం.. కానీ ప్లాస్టిక్ మన శరీరంలోనే భాగం అయింది. అర్థం కాలేదా? ఈ స్టోరీలోకి రండి. అమెరికా, ఆస్ట్రియా దేశాల తాజా పరిశోధనలో షాక్ అయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్లాస్టిక్ ఉపయోగం మానవ జాతి మనుగడకు ముప్పులా మారింది. ప్లాస్టిక్‎లో ఉండే అత్యంత సూక్ష్మరూపంలో ఉండే ప్లాస్టిక్ రేణువులు గాలిలో చేరుతున్నాయి. ,మనం తీసుకునే డ్రింక్, ఫుడ్ ద్వారా నీరు, ఆహారంలో కలుస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల రేణువులు గాలి, నీరు, ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించి హృదయం, మెదడు, మూత్రపిండాలు, కాలేయం ఇలా శరీరంలోని ప్రతి అవయవంపై దుష్ప్రభావం చూపుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అంత కంటే డేంజర్‎గా తల్లిపాలలో కూడా ప్లాస్టిక్ రేణువులను గుర్తించారు పరిశోధకులు. తల్లి పాల ద్వారా ...