ఆలోచించి ఓటు వేయండి.. అభివృద్ధి చేశాను - అభినయ్ రెడ్డి
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
తిరుపతిలోని సిద్దార్థ ఎడ్యుకేషనల్ అకాడమీ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఉపాధ్యాయులు మరియు విద్యార్ధులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ చదువు చెబుతున్న గురువులు, చదువుకుంటున్న విద్యార్థులైన మీరు అభివృద్ధిని ఇష్టపడతారు. అందుకే తిరుపతిని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశాను. నగరం రూపురేఖలు ఏవిధంగా మారిపోయాయో మీరే చూస్తున్నారు. అందుకే స్థానిక ఎమ్మెల్యే వారసుడిగా ఓట్లు అడిగేందుకు నేను రాలేదు.. నేను చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయండని అడగడానికి వచ్చానని పేర్కొన్నారు. ఇక్కడే పుట్టి, పెరిగిన వాడిగా నా తిరుపతి అభివృద్ధి చెందాలనే సంకల్పంతో అహర్నిశలు శ్రమిస్తున్నాను. ఇందులో భాగంగా ముందుగా మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాను. ఇప్పటికే 20 మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించి ట్రాఫిక్ కష్టాలు తీర్చాము. భవిష్యత్తులో మరో 14 మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే మీలాగా చదువుకున్న యువత ఉద్యోగాల కోసం ఇతర నగరాలకు వలస వెళ్లకుండా ఉండేందుకు ఇక్కడికే ఐటీ కంపెనీలు తీసుకొచ్చే దిశగా పనిచేస్తున్నాను. ఇందుకోసం శెటిపల్లిని ఐటీ హబ్‌గా మార్చాలని ప్రణాళికలు రచిస్తున్నాను. ఇప్పటికే పలు మిడ్ సైజ్ కంపెనీలతో చర్చలు జరిపాను. వారు కూడా మన నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కంపెనీలు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అందుకే రాబోయే ఎన్నికల్లో నాకు అండగా నిలబడితే మీకు ఉద్యోగాల కోసం వలస వెళ్లే పరిస్థితి తప్పుతుందన్నారు. అంతేకాకుండా నగరాన్ని క్రైమ్ ఫ్రీ సిటీగా చేసేందుకు 4వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు చేస్తున్నాను. ఇలా చేస్తే నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు,మహిళలపై దాడులు జరగకుండా ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. ఇక పారిశుద్ధ్యం విషయంలోనూ తిరుపతిని దేశంలోనే నెంబర్ వన్ సిటీగా నిలిపాలనే లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు. చదువుకున్న యువతగా రాబోయే ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయండి. అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి అని విజ్ఞప్తి చేస్తున్నానారు.
Comments
Post a Comment