లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్..!

 - కాసేపట్లో ఢిల్లీకి తరలింపు

- అధికారులు తో వాగ్వివాదం చేసుకున్న కెటిర్
హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ :
బీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ కేసులో కవితకు సెర్చ్ వారెంట్‌తో పాటు అరెస్ట్ వారెంట్‌నూ జారీ చేశారు అధికారులు. ఆమె రెండు ఫోన్లనూ స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని కవిత నివాసం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కవిత నివాసానికి భారీగా చేరుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఈడీ దాడులకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు ధర్నాకు దిగాయి. కేంద్రం, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సౌత్ గ్రూప్‌కు కవిత నేతృత్వం వహించారనేది ప్రధాన ఆరోపణ.

అసలు జరిగింది ఇది..!
ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఏడాది గ్యాప్‌ తర్వాత ఎమ్మెల్సీ కవితకు గత నెలలో సీబీఐ నోటీసులు ఇచ్చింది. 2022 డిసెంబర్‌లో కవిత నివాసంలోనే స్టేట్‌మెంట్ తీసుకున్న సీబీఐ.. గత నెల 26న ఢిల్లీకి రావాలని, తమ ఎదుట విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో కవితను నిందితురాలిగా చేర్చి 41-A కింద నోటీసులు ఇచ్చింది సీబీఐ. లిక్కర్ కేసులో కీలక నిందితులు అప్రూవర్లుగా మారడంతో.. వారి స్టేట్మెంట్స్ ఆధారంగా కవితకు నోటీసులు జారీ చేసింది సీబీఐ. ఇదే కేసులో ఇప్పటికే కవితను ఈడీ కూడా విచారించింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఎమ్మెల్సి కవిత. ఈ పిటిషన్‌ను ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. సీఆర్పీసీ నిబంధనల ప్రకారం విచారణ జరపడం లేదని కవిత ఆరోపించారు. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి ప్రశ్నించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై ఎలాంటి బలవంతపు చర్యలను ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కవిత కోరారు. దీంతో కేటీఆర్‌, హరీష్‌రావు తదితర నేతలు కవిత ఇంటికి చేరుకున్నారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు సైతం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ఈడీ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను కేటీఆర్‌ ప్రశ్నించారు. అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు లో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించిన కేటీఆర్. ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు కావాలని శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చారని కేటీఆర్‌ ఆరోపించారు. సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దు అంటూ హుకుం జారీ చేస్తున్న ఐడి అధికారులపై ఆయన మండిపడ్డారు. ఈరోజు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేందుకు అవకాశం లేదంటూనే… అరెస్టు అని చెప్పడం పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు