- ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్ర అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రయత్నం సఫలం
- తక్షణమే రూ.2కోట్ల నిధులు విడుదల
- పనులు వేగవంతం చేయడానికి కసరత్తు
- మీడియాకు వివరాలు వెల్లడించిన టిడిపి మండల నేతలు
- ఎమ్మెల్యే పులివర్తి నానికి కృతజ్ఞతలు తెలిపిన ఆలయ కమిటి
యర్రావారిపాళ్యం, త్రిశూల్ న్యూస్ :
ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులకు పరిచయం అక్కరలేని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతం తలకోన. ఉమ్మడి జిల్లాతో పాటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఎత్తైన జలపాతం, సిద్ధేశ్వర స్వామి ఆలయం, పచ్ఛనైన అటవీ సౌందర్యం ఇక్కడి ప్రత్యేకత. గత 4దశాబ్ధాలుగా చిత్ర పరిశ్రమకు ఈ ప్రాంతం సుపరిచితమే. తలకోన అభివృద్ధికి స్థానికి ఎమ్మెల్యే పులివర్తి నాని సంకల్పించారు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తలకోన పర్యాటక అభివృద్ధి, ఆలయ అభివృద్ధి ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లారు. అటు టిటిడిలో తలకోన ఆలయ అభివృద్ధికి కావలసిన సదుపాయాలను, ప్రత్యేకతను టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడుకు వివరించి ప్రతిపాదించారు. అక్కడి నుంచి సానుకూలత రావడంతో తలకోన అభివృద్ధికి మహర్దశ చేకూరడానికి అడుగులు పడ్డాయి. కాగా రూ.18కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంగా గురువారం టిడిపి మండల నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. మంజూరైన రూ.18కోట్లకు గానూ తొలి విడతగా రూ.2కోట్లు విడుదల చేసినట్లు వారు వివరించారు. ఆలయ అభివృద్ధితో పాటుగా జలపాతం, పరిసర ప్రాంతాల్లో భక్తులకు, పర్యాటకులకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నం సఫలమైందని పేర్కొన్నారు. తలకోన అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే పులివర్తి నానికి మండల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. పనులు వేగవంతంగా చేపట్టి తలకోనకు మహర్దశ తీసుకొస్తామని తెలియజేశారు. మీడియా సమావేశంలో తలకోన ఆలయ బోర్డు ఛైర్మన్ సోమనాథ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు దేశిరెడ్డి రఘునాథ, ప్రధాన కార్యదర్శి మహేష్ నాయుడు, నిరంజన్, మహిళా అధ్యక్షురాలు కొమ్మక లక్ష్మిదేవి, బాలకృష్ణమ నాయుడు, రాజన్న, సిరివేలు రఘు, సిరివేలు రమేష్, హరిచంద్ర, మురళి, కేశవులు నాయుడు, సిద్ధారెడ్డి, గుర్రప్పనాయుడు, చిట్టిబాబునాయుడు, కృష్ణయ్య, నాగరాజ, చిన్నపరెడ్డి, గోపీ పాల్గొన్నారు.

No comments:
Post a Comment