Trishul News

తెలంగాణలో టిడిపి బలపడుతుంది - చంద్రబాబు

భద్రాద్రి కొత్తగూడెం :
తెలంగాణలో టీడీపీ మళ్లీ బలపడుతుందని టీడీపీ అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. బూర్గం పహాడ్ మండలంలోని వరద బాధితులను పరామర్శించారు. వరదల్లో చిక్కుకుపోయిన నర్సయ్య కుటుంబానికి రూ. లక్ష అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం బలపడుతుంది అన్నారు. టిడిపి ఆవిర్భావమే తెలంగాణలో జరిగిందన్నారు. యువత భవిష్యత్తు కోసం తెలంగాణలో టీడీపీ ఉండాలన్నారు. ఖమ్మంతో తెదేపాకు విడదీయరాని బంధం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా కంచుకోట అని పేర్కొన్నారు.

కాగా, అంతకుముందు గురువారం ఆయన ఏలూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలైన వేలేరుపాడు, కుక్క నూరు మండలాల్లో పర్యటించారు. అక్కడ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం మెడలు వంచుతాను అన్న సీఎం జగన్ ఇప్పుడు ఎందుకు తలవంచుకున్నాడు అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు రప్పించేందుకు దమ్ముంటే వైసిపి ఎంపీలందరూ రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. అప్పుడు కేంద్ర ప్యాకేజీతో ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాదో చూద్దాం అని చెప్పారు. కష్టాల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డి, ప్రజలకు కష్టం వస్తే గోదాట్లో ముందు చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

పోలవరం బాధితులకు 1000 కోట్ల రూపాయలు, రెండు వేల కోట్లు అయితే ఇస్తా కానీ రూ. 20 వేల కోట్లు అయితే తనవల్ల కాదని చెప్పడం బాధ్యతారాహిత్యం అని మండిపడ్డారు. దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి, బాధితులతో మాట్లాడారు. ఆ తర్వాత శివకాశి పురంలోని పునరావాస కేంద్రాల వద్ద అమరావతి రాజధాని రైతులు ఇచ్చిన నిత్యావసరాల పంపిణీ ప్రారంభించారు. వరదబాధితుల సహాయార్థం భద్రాచలానికి చెందిన కొడాలి శ్రీనివాస్ 50 వేల రూపాయలు చెక్కును చంద్రబాబుకు అందించారు. తొలుత వేలేరుపాడు మండలం మేడిపల్లిలో కార్యకర్తలు, నాయకులు, ప్రజలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. శివకాశి పురం, బండ్లబోరు, దాచారం, కుక్కనూరులో వరద బాధితులను ఉద్దేశించి ప్రసంగించారు.శివకాశి పురంలో బాధితులు పరిహారం పునరావాసం వరద సాయంతో తమకు జరుగుతున్న అన్యాయంపై ఏకరువు పెట్టారు.

బురద కడుక్కోవడానికీ సరిపోదు.

'పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే రాష్ట్రం బాగుంటుందని ముంపు ప్రాంతాల ప్రజలు సర్వం త్యాగం చేశారు. పరిహారం, పునరావాసం విషయంలో కాంటూరు స్థాయి నుంచి తొలగించి కొత్త కుట్రకు జగన్ రెడ్డి తెరలేపారు.41.15కాంటూరు వరకే పరిహారం ఇస్తానని 45.72 కాంటూరు పరిధిలో వారికి ఇవ్వలేనని.. కేంద్రం ఇవ్వాలని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. అనాలోచిత నిర్ణయాలతో పోలవరం ముంపు మండలాల ప్రజలకు పిల్లని ఇచ్చేందుకు కూడా భయపడే పరిస్థితి కనిపిస్తోంది. వరద బాధిత ప్రాంతాల్లో సీఎం పర్యటన మొత్తం బారికేడ్ల చాట్ అనసాగింది అది కూడా నేను వచ్చానని అయిష్టంగానే పర్యటించారు. ఇప్పుడు కూడా తిరగకపోతే ప్రజలు భయపడతారని భయంతోనే వచ్చారు.

వారు ఇచ్చిన 2000 సాయం బాధితుల ఇంట్లో బురద కట్టుకోడానికి కూడా చాలదు. ఆయన వరద బాధితులను కాకుండా పెయిడ్ ఆర్టిస్టులు పేటియం మ్యాచ్లను కలిస్తే ప్రయోజనం ఏముంటుంది. వారు ఆయన ఏం చెప్పినా ఆహా ఓహో అంటున్నారు. ఆయన అందరికీ సహాయం అందించామని అనగానే ఈ బ్యాచ్ చప్పట్లు కొడుతోంది. ఈ కోడి కత్తి నాటకాలతో బాధితుల కడుపు నిండదు అని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ అలసత్వంతో పశువులు కూడా కొట్టుకుపోయాయి. చేతనైతే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వరద బాధితుల సహాయం కోసం చేసిన జీవోను అమలు చేయాలి పరిహారం రూ. 10 లక్షలకు పెంచుతూ ఇచ్చిన హామీని గాల్లో కలిపేశారు' అని విమర్శించారు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలానికి చంద్రబాబు చేరుకున్నారు. చంద్రబాబు వరద బాధితులతో మాట్లాడారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు రాత్రి 12 గంటలకు భద్రాచలం చేరుకుని అక్కడే కారవాన్ లో బస చేశారు.

Post a Comment

Previous Post Next Post