Trishul News

బంగాళాఖాతంలో వాయుగుండం.. 19న వర్షాలు..!


విశాఖపట్నం, త్రిశూల్ న్యూస్ :

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా బలపడే అవకాశం…దక్షిణ కోస్తాంధ్రపై ప్రభావం చూపనుంది వాయుగుండం…ఈనెల 19నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉంది. రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా పడుతున్న వర్‌షాలతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉయదగిరి, కావలి, గూడూరు నియోజకవర్గాల్లో కూడా వర్ఫం పడింది. ఇప్పటికే భారీ వర్షాలతో అల్లాడుతోంది తమిళనాడు. తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా చలి తీవ్రత పెరిగింది. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో వణికిస్తుంది చలి. సింగిల్ డిజిట్ దిశగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంక్షేమ హాస్టళ్ళలో విద్యార్ధినీ, విద్యార్ధులు చలి తీవ్రతకు వణికిపోతున్నారు. పాడేరులో 12 డిగ్రీలు, మినుములూరులో 10 డిగ్రీలు, అరకులో11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత పెరగడంతో చర్యలు చేపట్టింది ప్రభుత్వం..మన్యంలో ఆశ్రమ పాఠశాలల విద్యార్దులకు 13వేల రగ్గులు పంపిణీ చేశారు. అరకు, ఏవోబీ సరిహద్దుల్లో పొగమంచు కమ్ముకుంది.

Post a Comment

Previous Post Next Post