Trishul News

హైకోర్టు హౌస్ కీపింగ్ కార్మికు లకు కనీస వేతనాలు ఇవ్వాలి..!

- సిఐటియు రాజధాని డివిజన్ కమిటీ డిమాండ్
అమరావతి, త్రిశూల్ న్యూస్ :
ఏపీ హైకోర్టులో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ కార్మికులకు నెలకు కేవలం 10,000 రూపాయలు జీతం మాత్రమే ఇస్తున్నారని సిఐటియు రాజధాని డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ఎం రవి, ఎం భాగ్యరాజు అన్నారు. ఈ మేరకు మంగళవారం నాడు జరిగిన హైకోర్టు హౌస్కీపింగ్ కార్మికుల విస్తృత సమావేశంలో వారు మాట్లాడుతూ చాలీచాలని జీతాలతో పెరుగుతున్న దరలను అందుకోలేక, కార్మికులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. హైకోర్టు హౌస్ కీపింగ్ కార్మికులను అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ లోకి తీసుకొని జీతం 15000, మెడికల్ అలవెన్స్ 6000 కలిపి 21 వేల రూపాయలు ఇవ్వాలని వారు కోరారు. హౌస్ కీపింగ్ కార్మికులకు పని భద్రత లేకుండా పోయిందని చీటికిమాటికి సూపర్వైజర్లు బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. ఆరా కోర జీతాలతో కష్టపడి పనిచేస్తున్న కార్మికులను బెదిరింపులకు గురి చేస్తే యూనియన్ గా చూస్తూ ఊరుకోమని వారు హెచ్చరించారు. కార్మికులకు అండగా సిఐటియు నిలుస్తుందని వారు తెలిపారు. హైకోర్టులో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ కార్మికుల పని భద్రత కోసం, జీతాల పెంపుదల కోసం ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ లో కి తీసుకునే వరకు దశలవారీగా ఆందోళనలు చేపడుతామని వారు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post