Trishul News

మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు కృషి చేయండి - నెల్లూరు కమిషనర్ హరిత

నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
వర్షాకాలపు సమస్యలను దృష్టిలో ఉంచుకుని సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న కార్యదర్శులు స్థానికంగా మెరుగైన పారిశుధ్య సేవలు అందించేందుకు కృషి చేయాలని కమిషనర్ హరిత సూచించారు. స్థానిక 19/2 లెక్చరర్స్ కాలనీ సచివాలయాన్ని కమిషనర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో సంక్షేమ పథకాల అమలు రికార్డులను, సిబ్బంది హాజరును పరిశీలించి, సచివాలయం పరిధిలోని గృహాలు, కమర్షియల్ భవనాలన్నింటికీ చెత్త సేకరణ బిన్స్ పంపిణీ గురించి విచారించారు. కమర్షియల్, ఆస్థి పన్నులతో పాటు, ఇంటింటి చెత్త సేకరణకు యూజర్ చార్జీల వసూళ్ళపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ సచివాలయం కార్యదర్శులకు ఆదేశించారు. సచివాలయ కార్యదర్శులంతా ప్రభుత్వం సూచించిన డ్రెస్ కోడ్ యూనిఫామ్ ప్రతిరోజూ తప్పక ధరించాలని కమిషనర్ సూచించారు. విధుల పట్ల నిబద్ధతతో వ్యవహరించి క్షేత్రస్థాయి వరకు ప్రజలకు సంక్షేమం అందేలా బాధ్యత వహించాలని కార్యదర్శులకు కమిషనర్ సూచించారు.

Post a Comment

Previous Post Next Post