Trishul News

ఆథ్లెటిక్ లో గోల్డ్ మెడల్ సాధించిన లక్ష్మీ ప్రసన్న..!

పలమనేరు, త్రిశూల్ న్యూస్ :
నవంబర్ నెల 4,5,6 తేదీలలో నిర్వహించిన నేషనల్ ఆర్థోటిక్ మీట్ పోటీలలో పలమనేర్ పట్టణానికి చెందిన అంగడి వీధిలో నివసిస్తున్న లక్ష్మీపతి రెడ్డి, శశికళ కుమార్తె లక్ష్మీ ప్రసన్న గోల్డ్ మెడల్ సాధించినట్లు అమ్మాయి తల్లిదండ్రులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ లక్ష్మీ ప్రసన్న పలమనేర్ పట్టణానికి సమీపంలో ఉన్న కేటల్ ఫారం ఈమాస్విస్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నదని చిన్నప్పటి నుండి లక్ష్మీ ప్రసన్న ఆటల పోటీల్లో చాలా ఉత్సాహంగా చురుకుదనముతో పాల్గొనేదని వివరించారు. నవంబర్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పూణే ప్రాంతాలలో నిర్వహించిన ఆథ్లెటిక్ స్పీడ్ వాక్ పోటీలలో మూడు కిలోమీటర్లు దూరాన్ని 17 నిమిషాల 44 సెకండ్లలో పరిగెత్తి ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారుల్లో లక్ష్మీ ప్రసన్న ఒక్కరే ఎంపికైందని, మంచి పట్టుదల, సాహాసముతో గోల్డ్ మెడల్ సాధించిందన్నారు ఈ సందర్భంగా లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ నా తల్లిదండ్రులు, స్కూలు ఉపాధ్యాయులు ప్రోత్సాహం వల్లనే ఈ స్థాయికి ఎదిగానని, భవిష్యత్తులో పెద్దలు ప్రోత్సాహం ఉంటే ఇంటర్ నేషనల్ ఆత్లేటిక్ పోటీల్లో పాల్గొని తాను జన్మించిన ఊరికి గొప్ప పేరు తెస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. అథ్లెటిక్ పోటీల్లో పాల్గొన్న అభ్యర్థుల కంటే జిల్లాలో ఏకైక వ్యక్తిగా ఎంపికై మంచి గుర్తింపు తెచ్చిన ప్రసన్నకు పట్టణవాసులు, బంధుమిత్రులు పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థిని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. లక్ష్మీ ప్రసన్నను ప్రోత్సహించిన ఇమాస్విస్ పాఠశాల ప్రిన్సిపాల్ కాత్లీన్ జాకోబ్, ట్రైనర్ జలాల్, ఉపాధ్యాయులకు లక్ష్మి ప్రసన్న తల్లిదండ్రులు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. 

Post a Comment

Previous Post Next Post