Trishul News

నవరత్నాల ద్వారా సంక్షేమాభివృద్ధికి బాటలు - మంత్రి జోగి రమేష్

గూడూరు, త్రిశూల్ న్యూస్ :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాల ద్వారా సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. గురువారం ఆయన కృష్ణా జిల్లా గూడూరు మండలం, ఆకులమన్నాడు గ్రామంలో కొనసాగింపుగా రెండవ రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులు పొందిన ఆయా పథకాల లబ్ధిని వారికి వివరిస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న నిర్విరామ కృషిని వివరించారు.

       ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుటుంబాలు అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుందన్న సత్యాన్ని గ్రహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కాలంలో ఎన్నడూ లేనివిధంగా కుటుంబ అభివృద్ధికి అవసరమైన నవరత్నాల పథకాల ద్వారా సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. అందుకు వాలంటీరు, సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి పక్షపాతం చూపకుండా పథకాలను అందిస్తున్నారని కొనియాడారు. తల్లిలా ప్రేమను చూపిస్తూ మంచి చేస్తున్న ముఖ్యమంత్రిని మనసారా దీవించాలని మంత్రి ప్రజలను కోరారు. గ్రామస్తుల అభ్యర్థన మేరకు గ్రామ సచివాలయాలకు ప్రభుత్వం మంజూరు చేసే నిధులతో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.
       
ఈ కార్యక్రమంలో గూడూరు మండల జెడ్పిటీసి వేముల సురేష్ రంగబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ గరికపాటి చారుమతి రామానాయుడు, గూడూరు ఎంపిపి సంగా మధుసూదనరావు, ఆకులమన్నాడు ఎంపీటీసీ కోళ్ల లక్ష్మణరావు, మండల పార్టీ అధ్యక్షుడు తలుపుల వెంకట కృష్ణారావు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరరావు, ఆర్బికే చైర్మన్ పర్ణం పెదబాబు, పిఏసిఎస్ చైర్మన్ ఫైజుల్ రహమాన్, వైస్ ఎంపిపిలు నేతల కుటుంబ రావు, పిచ్చుక గంగాధర రావు,గొరిపర్తి రవి కుమార్, వీరా ఉమ, ఎజ్జు వెంకయ్య, సాయన సుబ్బారావు, అంకం సోమయ్య, మిరియాల వెంకటేశ్వరరావు, గూడూరు తహసీల్దార్ బి విజయ ప్రసాద్, ఎంపీడీవో డి. సుబ్బారావు, , వివిధ శాఖల అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post