Trishul News

మంత్రులు మూడు రాజధానుల నినాదం సిగ్గుచేటు - మాజీ ఎమ్మెల్యే

- వైసిపి నాయకులు భూదాహం తీర్చుకోవడానికి ప్రకటనలు

- మంత్రి ఉషశ్రీ చరన్ పై టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఫైర్
కళ్యాణదుర్గం, త్రిశూల్ న్యూస్ :
నవ్యాంధ్రప్రదేశ్ కు రాజధాని అమరావతి ఉండాలని ప్రతిపక్షంలో గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సహచర మంత్రులు సిగ్గు లేకుండా మూడు రాజధానుల నినాదం ఎత్తుకోవడం హాస్యాస్పదంగా ఉందని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి అన్నారు. గురువారం కళ్యాణదుర్గంలో తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఒక రాజదాని వద్దు, మూడు రాజదానులు ముద్దు అంటూ స్థానిక ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ మానవహారం చేయడాన్నీ తప్పు పట్టారు. రాయలసీమ ప్రాంతానికి, ఉత్తరాంధ్రకి సమాన దూరంలో ఉండే అమరావతిని ఏకైక రాజధానిగా ఏర్పాటు చేయాలని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన తీర్మానానికి అసెంబ్లీలో మద్దతు పలికి అధికారంలోకి రాగానే నిస్సిగ్గుగా మడమ తిప్పడం ఏ రాజకీయమని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు భూదాహం తీర్చుకోవడానికి విశాఖపట్నం రాజధాని అంటూ ప్రకటనలు చేస్తున్నారని ఇది అమలు సాధ్యం కాదని అన్నారు. మీడియా సమావేశంలో మాజీ జెడ్పిటిసి సభ్యుడు శివశంకర్, మల్లికార్జున, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ రామాంజనేయులు, మండల టిడిపి కన్వీనర్ డీకే రామాంజనేయులు, గరుడాపురం సర్పంచ్ లక్ష్మణమూర్తి, కొల్లాపూరప్ప , గోవిందరెడ్డి, గడ్డం రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు .

Post a Comment

Previous Post Next Post