Trishul News

ముందస్తు ఎన్నికల అంశంపై సీఎం కేసీఆర్ స్పష్టమైన ప్రకటన..!

హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ :
టీఆర్ఎస్ కీలక సమావేశంలో ముందస్తు ఎన్నికల అంశంపై సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టమైన ప్రకటన చేశారు. ముందస్తు ఎన్నికలు ఉండవని పార్టీ ఎమ్మెల్యేలకు, ముఖ్యనేతలకు క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం కూడా లేదని.. మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే ఉండాలని అన్నారు. మంత్రులు జిల్లా కేంద్రాల్లో ఉంటూ పర్యవేక్షించాలని.. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఆరా తీయాలని ఆదేశించారు. పార్టీ, ప్రభుత్వపరంగా ఉన్న లోటుపాట్లను నా దృష్టికి తీసుకురావాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో కూడా మనం గెలిచి మరోసారి అధికారం దక్కించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇప్పించుకుని గెలిపించుకునే బాధ్యత తనదే అని సీఎం కేసీఆర్ నేతలతో ఉన్నారు. రాబోయే 10 నెలల కాలం ఎమ్మెల్యేలంతా నియోజకవర్గంలోనే ఉండాలని.. మునుగోడు తరహాలోనే ఎప్పటికప్పుడు ఓటర్లను కలుస్తూ ఉండాలని.. వారితో సమన్వయం చేసుకునేందుకు క్షేత్రస్థాయిలో నమ్మకమైన పార్టీ శ్రేణులను వినియోగించుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ నేతలపై ఒత్తిడి చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని.. ఈ విషయంలో ఏదైనా జరిగితే వెంటనే పార్టీ నాయత్వానికి సమాచారం ఇవ్వాలని అన్నారు. సమావేశంలో హాజరైన ఫామ్‌హౌస్ కేసు ఎమ్మెల్యేల వ్యవహారాన్ని ప్రస్తావించిన కేసీఆర్.. వీరంతా బీజేపీ ప్రలోభాలను తన దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. రాబోయే 10 నెలలో కాలంలో బీజేపీతో యుద్ధమే ఉంటుందని కేసీఆర్ నేతలకు వివరించారు. ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక త్వరలోనే ఒక ఇంఛార్జ్‌ను నియమిస్తామని.. రాష్ట్ర నాయకత్వానికి ఆయా నియోజకర్గానికి మధ్య వీళ్లు సమన్వయకర్తలుగా ఉంటారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ సమావేశానికి కేసీఆర్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు ఫామ్ హౌస్ కేసులో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. భేటీ తరువాత ఆ నలుగురు ఎమ్మెల్యేలు మళ్లీ ఒకటే కారులో వెళ్లిపోయారు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు వారికి ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. ఇంకా నలుగురు ఎందుకు కలిసి తిరుగుతున్నారని అన్నారు. మీరు నియోజకవర్గానికి వెళుతున్నారా ? అని అడిగారు. భవిష్యత్తులో చెప్పాల్సింది ఇంకా చాలా ఉందని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. తన మీద నియోజకవర్గంలో పోస్టర్లు వేసిన వాళ్లు రాజకీయంగా భూస్థాపితం అవుతారని అన్నారు. 

Post a Comment

Previous Post Next Post