Trishul News

మూడు రోజుల చంద్రబాబు పర్యటనకు సర్వం సిద్ధం..!


◆ కందకూరులో నేడు రోడ్ షో, బహిరంగ సభ
◆ 29న పొగాకు రైతులతో ముఖాముఖి
◆ గ్రామగ్రామానా టీడీపీ శ్రేణులతో భేటీ అవుతున్న ఇంటూరి నాగేశ్వరరావు
◆ కార్యకర్తలకి ఫోన్లు చేస్తున్న ఇంటూరి రాజేష్
◆ చంద్రబాబు పర్యటన విజయవంతం చేయడానికి కృషి చేస్తున్న నేతలు
◆ టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద ద్విచక్రవాహనాలతో భారీగా స్వాగతం పలకనున్న కొండపి నేతలు
కందకూరు, త్రిశూల్ న్యూస్ :
‘రాష్ట్రానికి ఇదేమి ఖర్మ’ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొననున్న కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. నేటి మధ్యాహ్నం ప్రకాశం జిల్లా ఒంగోలు, టంగుటూరు, సింగరాయ కొండల మీదుగా ప్రస్తుతం నెల్లూరు జిల్లా పరిధిలోని కందుకూరు నియోజకవర్గంలోకి చంద్రబాబు చేరనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం కందుకూరులో రోడ్‌షో నిర్వహించి సాయంత్రం 7.30 గంటలకు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాత్రికి సింగరాయకొండ రోడ్డులోని ఆళ వారి కల్యాణ మండపంలో ఆయన బసచేస్తారు. 29వ తేదీ ఉదయం 11 గంటలకు అదే కల్యాణ మండపంలో పొగాకు రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. దళిత విద్యార్థులతో ఆయన సమావేశమయ్యే అవకాశముంది. మధ్యాహ్నం 2.30 గంటలకు బయల్దేరి సింగరాయకొండ బైపాస్‌ నుంచి కావలి వెళతారు. ప్రధానంగా కందుకూరు నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటున్నప్పటికీ కొండపి నియోజకవర్గ టీడీపీ శ్రేణులు కూడా టంగుటూరు టోల్‌ ప్లాజా వద్ద ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నాయి. ఎమ్మెల్యే స్వామి, టీడీపీ రాష్ట్ర నేత దామచర్ల సత్య సూచన మేరకు వేలాది ద్విచక్రవాహనాలతో బాబుకు స్వాగతం పలికేందుకు సన్నద్ధమవుతున్నారు.

ఊరూరూ తిరుగుతున్న ఇంటూరి నాగేశ్వరరావు

కందుకూరు నియోజకవర్గంలో చంద్రబాబు కార్యక్రమం జరగనున్నందున ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు గ్రామ గ్రామానికి వెళ్లి పార్టీ శ్రేణులను కందుకూరుకు తరలిరావాలని కోరుతున్నారు. గుడ్లూరు, ఉలవపాడు, లింగసముద్రం, వీవీపాలెం మం డలాల్లోని దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో కందుకూరు మునిసిపాలిటీల్లోని అన్ని వార్డుల్లోనూ స్థానిక నేతలతో కలిసి ఆయన పార్టీ శ్రేణులను కదిలించారు. 

ఫోన్లు చేస్తున్న ఇంటూరి రాజేష్

చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయడానికి తెలుగుదేశం పార్టీకి వెళ్లిన పార్లమెంటు బాధ్యతలు ఇంటూరి రాజేష్ తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. నియోజకవర్గ ప్రజలు తిరిగి బాగా పరిచి ఉన్న నేతలకు నేరుగా ఫోన్ చేస్తున్నారు అదే విధంగా కార్యకర్తలని కార్యక్రమాలు తప్పనిసరిగా పాల్గొనే విధంగా ఆయన వారితో మాట్లాడుతున్నారు.

పసుపు మయమైన కందుకూరు

చంద్రబాబు పర్యటన సందర్భంగా సింగరాయకొండ దగ్గర అండర్ బైపాస్ వద్ద నుంచి స్వాగతం పలుకుతూ భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ఇన్చార్జ్ ఇంటూరు నాగేశ్వరరావు నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు ఇంటూరి రాజేష్ లు భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలతో పాటు బెలూన్లను కూడా సిద్ధం చేశారు.

Post a Comment

Previous Post Next Post