Trishul News

సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి - తిరుపతి జాయింట్ కలెక్టర్ బాలాజీ

తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
దేశ రక్షణ కోసం దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాటం సాగిస్తున్న సైనికులు త్యాగాలకు వెలకట్టలేమని జిల్లా జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ తెలియజేశారు. త్రీసాయిధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఆర్ విజయ శంకర్ రెడ్డి, సిబ్బంది, ఎన్సిసి విద్యార్థులు, మాజీ సైనికులు జిల్లా కలెక్టర్ తిరుపతి కార్యాలయానికి చేరుకుని సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో దేశం కోసం శత్రుదేశాల సైన్యంతో మరియు టెర్రరిస్టులతో నిత్యం పోరాటం చేస్తూ వీరమరణం పొందిన జవాన్ల కుటుంబ సభ్యులకు అండగా నిలవాల్సిన బాధ్యత దేశ ప్రజలపై ఉందని జాయింట్ కలెక్టర్ వివరించారు.  కేవలం యుద్ధ సమయంలోనే కాకుండా మనదేశంలో వివిధ ప్రాంతాలలో ఆకస్మికంగా సంభవించే వరదలు భూకంపాలు మరియు తుఫానులు వచ్చినప్పుడు సైనిక దళాలు చేపట్టిన సహాయ కార్యక్రమాలు దేశ ప్రజల మన్ననను మరియు అభిమానాన్ని ఎంతగానో పొందాయని ఆయన వివరించారు. కార్గిల్ యుద్ధ సమయంలోను పాకిస్తాన్ ఉగ్రవాదులపై జరిపిన సర్జికల్ దాడుల్లోనూ మన సైనికులు చూపిన ధైర్య సాహసాలు, తెగువకు మన దేశ ప్రజలందరూ గర్విస్తున్నారని ఆయన తెలిపారు .అమరవీరుల కుటుంబ సభ్యుల సంక్షేమానికి దేశ ప్రజలు విరివిగా విరాళాలు అందించాలని  జాయింట్ కలెక్టర్ 
తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఆర్ విజయ శంకర్ రెడ్డి మరియు కార్యాలయ సిబ్బంది, ఎన్  సి సి క్యాడట్లు మరియు మాజీ సైనికులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ సి సి  విద్యార్థులు హుండీ బాక్స్ ద్వారా మొదటి విరాళాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్  డీకే బాలాజీ సేకరించారు.

Post a Comment

Previous Post Next Post