Trishul News

38 ఏళ్ల తర్వాత నేలరాలనున్న నాసా శాటిలైట్..!

కేప్ కెనరవల్‌, త్రిశూల్ న్యూస్ :
భూమి అధ్యయనం కోసం నాలుగు దశాబ్ధాల క్రితం నాసా ప్రయోగించిన ఈఆర్బీఎస్ ఉపగ్రహం నేలరాలనున్నది. దాదాపు 38 ఏళ్ల తర్వాత ఆ శాటిలైట్(ఎర్త్ రేడియేషన్ బడ్జెట్ శాటిలైట్‌) రిటైర్‌కానున్నట్లు నాసా వెల్లడించంది. ఆకాశం నుంచి ఆ ఉపగ్రహం భూకక్ష్యలోకి ఎంటర్‌కానున్నది. ఆ తర్వాత అది మండిపోనున్నది. దాదాపు 2450 కిలోల బరువు ఉన్న ఆ శాటిలైట్ భూ వాతావరణంలోకి ఎంటర్ కాగానే మండిపోతుందని, దాని శిథిలాలు ఎక్కడైనా పడే వీలు ఉన్నట్లు నాసా పేర్కొన్నది. మరికొన్ని శిథిలాల ఆ కక్ష్యలోనే ఉండిపోనున్నట్లు తెలుస్తోంది. శాటిలైట్ శిథిలాల వల్ల ప్రమాదం జరిగే ఛాన్సు తక్కువ అని నాసా చెప్పింది. ఆదివారం రాత్రి ఆ ఉపగ్రహం కూలిపోనున్నది. ఆ ప్రక్రియకు దాదాపు 17 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అమెరికా రక్షణ శాఖ తెలిపింది. ఆఫ్రికా, ఆసియా, మిడిల్ఈస్ట్ రూట్లో ఆ శాటిలైట్ కూలే ఛాన్సు ఉంది. ఎర్త్ రేడియేషన్ బడ్జెట్ శాటిలైట్‌(ఈఆర్బీఎస్‌)ను 1984లో ప్రయోగించారు. ఛాలెంజర్ వ్యోమనౌక ద్వారా దాన్ని నింగిలోకి పంపారు. ఆ శాటిలైట్ జీవితకాలం రెండేళ్లే కానీ, దాదాపు 2005 వరకు అది సమాచారాన్ని ఇస్తూనే ఉన్నది. ఓజోన్‌తో పాటు ఇతర వాతావరణ పరిస్థితులపై ఆ శాటిలైట్ డేటాను షేర్ చేస్తూ వచ్చింది. సూర్యుడి, భూమి మధ్య సాగే ఎనర్జీ ట్రాన్స్‌ఫర్‌పై ఆ శాటిలైట్ స్టడీ చేసింది.

Post a Comment

Previous Post Next Post