Trishul News

కుప్పం ప్రజలది పసుపు రక్తం.. వారి గుండెల్లో ఉండేది సైకిల్ - చంద్రబాబు

కుప్పం, త్రిశూల్ న్యూస్ :
ఏపీ సీఎం జగన్, పోలీసులపై మండిపడ్డారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు. కుప్పం ప్రజలది పసుపు రక్తం.. వారి గుండెల్లో ఉండేది సైకిల్ అన్నారు. చిత్తూరు జిల్లా గుడుపల్లెలో చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సీఎం పని అయిపోయింది. పోలీసుల పేర్లు అన్నీ గుర్తుపెట్టుకుంటాను… వారికి పనిష్మెంట్ ఉంటుందన్నారు. నేను తిరిగితే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని ఇలా చేస్తున్నారు. నా సభలకు జనాలు స్వచ్ఛందంగా వస్తున్నారు. నన్ను శారీరకంగా ఇబ్బంది పెట్టీ వేధిస్తున్నారు. పోలీసులు ఎందుకు ముఖం చాటేస్తున్నారు? ఇక్కడ కాకపోతే ఎక్కడ సభ పెట్టుకోవాలో చెప్పాలి? మీరు పోలీసులా, టెర్రరిస్ట్ లా? ఒక్క అవకాశం అన్నావ్… భస్మాసుర హస్తం చూపావు… నిన్ను భూస్థాపితం చేస్తాము. నన్ను ఎందుకు తిరగనివ్వరు. నేనేమైనా తీవ్రవాదా…? నక్సలైట్ నా? 43 ఏళ్ల రాజకీయ జీవితం నాది. పోలవరం ముంచారు. కేవలం 20 కోట్ల రూపాయల హంద్రీ నీవా పెండింగ్ పనులు చేయలేకపోతున్నారు. బాబాయ్ ని చంపిన వారిని పోలీసులు పట్టుకోరు, కానీ నన్ను ఆపుతారా…వివేకానంద రెడ్డి హత్య కేసులో నీకు, నీ తమ్ముడికి శిక్ష తప్పదు…ఇది పోలీసుల అరాచకం… వీరిని పాలిస్తున్నది సైకో ముఖ్యమంత్రి. మీకు మానవత్వం ఉందా…. నన్ను నడిపించడానికి మీకు సిగ్గు అనిపించలేదా? అని మండిపడ్డారు చంద్రబాబునాయుడు. ఈ సీఎం ను చూస్తే కోపం కాదు జాలి వేస్తోంది. ఫైన్ లు కడతారా… ఫండ్ ఇస్తారా… అని గ్రానైట్ వ్యాపారులను పెద్దిరెడ్డి బెదిరిస్తున్నారు. ఎవరూ భయపడవద్దు, డబ్బులు చెల్లించవద్దు. గుంటూరు ఘటనలో కానుకలు పంచేటప్పుడు ముగ్గురు చనిపోయారు. గుంటూరు ఘటనలో ఎన్నారైని వేధిస్తున్నారు. మళ్ళీ మీకు జాబు రావాలంటే బాబు రావాలన్నారు చంద్రబాబు.

Post a Comment

Previous Post Next Post