Posts

Showing posts from September, 2023

గాంధీ జయంతి సందర్బంగా రేపు జైల్లో చంద్రబాబు నిరసన దీక్ష?

Image
రాజమండ్రి, త్రిశూల్ న్యూస్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తనను నిర్భంధించిన రాజమండ్రి సెంట్రల్‌ జైల్లోనే గాంధీ జయంతి రోజున నిరసన దీక్ష చేయనున్నారు. తనకు జరిగిన అన్యాయంపై ఉదయం నుంచి సాయంత్రం వరకూ దీక్షలో కూర్చుని నిరసన వ్యక్తం చేస్తారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. గాంధీ జయంతి రోజు జైల్లో దీక్ష చేయాలని చంద్రబాబును కోరామని, ఆయన అంగీకరించారని తెలిపారు. అదే రోజున ఆయన సతీమణి భువనేశ్వరి రాజమహేంద్రవరంలో ఒకరోజు దీక్ష చేస్తారని తెలిపారు. ఇందుకు సంఘీభావంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు చేపట్టాలని, ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

మా స్నేహం మీద ఒట్టు చంద్రబాబు అలాంటి వారు కాదు - చిన్న నాటి స‌్నేహితులు

Image
- చంద్రబాబు కష్టం విలువ తెలిసినవాడు - ప్రభుత్వం మూర్ఖత్వంతో మంచితనానికి మచ్చ వేయాలని చూస్తున్నది - ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కూడా పార్టీలకు అతీతంగా స్నేహానికి విలువ ఇచ‌్చేవాడు - ప్రజలకు సేవ చేయడం మాత్రమే ఆయనకు తెలుసు - కన్నీటి పర్వంతమైన చంద్రబాబు చిన్ననాటి స్నేహితులు చంద్రగిరి, త్రిశూల్ న్యూస్ :  చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా 14వ రోజైన బుధవారం చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద ఆయన చిన్ననాటి స్నేహితులు ఆయనతో పాటు విద్యాభ్యాసము చేసిన సహో ధ్యాయులు, సీనియర్ సిటిజన్స్ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు యొక్క గొప్పతనాన్ని, కృషిని, ప్రజాసేవను, నీతి నిజాయితీని తలుసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. రోడ్లు అభివృద్ధి చెందితే మిగిలిన రంగాలన్నీ అభివృద్ధి దిశలో పరుగులు తీస్తాయని నాటి ప్రధానమంత్రి వాజ్పాయ్ ని ఒప్పించి దేశం నాలుగు దిక్కులు కలుపుతూ సిక్స్ లైన్స్ రోడ్ల స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టటానికి చంద్రబాబు నాయుడు కృషే కారణం అని అలాంటి గొప్ప నాయకుడు కక్షపూరితమైన స్వార్థ రాజకీయాలకు గురై రిమాండ్ ఖైదీగా జైలులో ఉంచటం దారుణమన్నారు. విమానాశ్రయాలు, నౌకాశ్ర

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం.. ఎయిర్‌రైఫిల్‌లో ప్రపంచ రికార్డు..!

Image
క్రీడలు, త్రిశూల్ న్యూస్ : ఆసియా క్రీడల్లో భారత్‌ అథ్లెట్ల హవా ప్రారంభమైంది. 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌ విభాగంలో టీమ్‌ఇండియా స్వర్ణ పతకం సాధించింది. ఈ క్రమంలో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. రుద్రాంక్ష్ పాటిల్, దివ్యాన్ష్‌, తోమర్‌తో కూడిన బృందం ఫైనల్‌లో 1893.7 పాయింట్లను నమోదు చేసింది. దీంతో గతంలో చైనా చేసిన 1893.3 పాయింట్ల రికార్డును అధిగమించింది. ప్రస్తుతం టీమ్‌ఇండియా ఖాతాలో ఒక స్వర్ణం, మూడు రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి. 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌ విభాగంలో జట్టుగా స్వర్ణం గెలిచిన రుద్రాంక్ష్‌, దివ్యాన్ష్‌, తోమర్‌ వ్యక్తిగతంగానూ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. ఫైనల్‌ కోసం జరిగిన పోటీల్లో రుద్రాంక్ష్‌ మూడో స్థానం, తోమర్‌ ఐదోస్థానం, దివ్యాన్ష్ ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. మరోవైపు మెన్స్‌ ఫోర్ రోయింగ్‌ ఈ వెంట్‌ లోనూ భారత్‌ కాంస్య పతకం దక్కించుకుంది.

రిలే నిరాహార దీక్షను ప్రారంభించిన ఖమ్మం పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ రామనాధం..!

Image
ఖమ్మం, త్రిశూల్ న్యూస్ : ఖమ్మం తెలుగుదేశంపార్టీ కార్యాలయం ఎదుట తెలుగుదేపార్టీ శ్రేణులు, నాయకులు కార్యకర్తల అధ్వర్యంలో జరిగే రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని డాక్టర్ రామనాథం ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ ను చేతిలో పెట్టుకొని ప్రతిపక్షాలపై అక్రమ అరెస్టులు చేపిస్తూ ఎక్కడ సభలు, ర్యాలీలు, పెట్టుకున్న దాడులు చేయిస్తూ రాజ్యాంగాన్ని పక్కన పెట్టీ సైకో చేష్టలతో ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగత పాలు చేస్తున్నారని, ఇలాంటి దుర్మార్గపు చర్యలను తెలుగు రాష్ట్రాలే కాక ఇతర పార్టీ నాయకులు సినీ తారలు తీవ్రంగా ఖండిస్తున్నారు అని అన్నారు. అప్రజాస్వామ్యికంగా వ్యవహరించే జగన్ రెడ్డి లాంటి దుర్మార్గపు ముఖ్యమంత్రిని ఏ రాష్టంలో చూడలేదని, రాజకీయంగా, ప్రజాబలంతో ఎదుర్కొనే సత్తా లేక, అన్యాయపు కేసు పెట్టి అక్రమంగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నాడని, బాబు గారి పట్ల సైకో జగన్ రెడ్డి, ఆయన అనుచరులు చేస్తున్న దాడులకు వడ్డీతో సహా తిరిగి చెల్లించే రోజు దగ్గరలోనే వుందని, వైసీపీ గుండాలు మొత్తాన్ని ఊచలు లెక్క పెట్టిస్తామని హెచ్చరించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు న