ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం.. ఎయిర్‌రైఫిల్‌లో ప్రపంచ రికార్డు..!

క్రీడలు, త్రిశూల్ న్యూస్ :
ఆసియా క్రీడల్లో భారత్‌ అథ్లెట్ల హవా ప్రారంభమైంది. 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌ విభాగంలో టీమ్‌ఇండియా స్వర్ణ పతకం సాధించింది. ఈ క్రమంలో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. రుద్రాంక్ష్ పాటిల్, దివ్యాన్ష్‌, తోమర్‌తో కూడిన బృందం ఫైనల్‌లో 1893.7 పాయింట్లను నమోదు చేసింది. దీంతో గతంలో చైనా చేసిన 1893.3 పాయింట్ల రికార్డును అధిగమించింది. ప్రస్తుతం టీమ్‌ఇండియా ఖాతాలో ఒక స్వర్ణం, మూడు రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి. 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌ విభాగంలో జట్టుగా స్వర్ణం గెలిచిన రుద్రాంక్ష్‌, దివ్యాన్ష్‌, తోమర్‌ వ్యక్తిగతంగానూ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. ఫైనల్‌ కోసం జరిగిన పోటీల్లో రుద్రాంక్ష్‌ మూడో స్థానం, తోమర్‌ ఐదోస్థానం, దివ్యాన్ష్ ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. మరోవైపు మెన్స్‌ ఫోర్ రోయింగ్‌ ఈ వెంట్‌ లోనూ భారత్‌ కాంస్య పతకం దక్కించుకుంది.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు