మా స్నేహం మీద ఒట్టు చంద్రబాబు అలాంటి వారు కాదు - చిన్న నాటి స‌్నేహితులు
- చంద్రబాబు కష్టం విలువ తెలిసినవాడు
- ప్రభుత్వం మూర్ఖత్వంతో మంచితనానికి మచ్చ వేయాలని చూస్తున్నది
- ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కూడా పార్టీలకు అతీతంగా స్నేహానికి విలువ ఇచ‌్చేవాడు
- ప్రజలకు సేవ చేయడం మాత్రమే ఆయనకు తెలుసు
- కన్నీటి పర్వంతమైన చంద్రబాబు చిన్ననాటి స్నేహితులు
చంద్రగిరి, త్రిశూల్ న్యూస్ :
చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా 14వ రోజైన బుధవారం చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద ఆయన చిన్ననాటి స్నేహితులు ఆయనతో పాటు విద్యాభ్యాసము చేసిన సహో ధ్యాయులు, సీనియర్ సిటిజన్స్ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు యొక్క గొప్పతనాన్ని, కృషిని, ప్రజాసేవను, నీతి నిజాయితీని తలుసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. రోడ్లు అభివృద్ధి చెందితే మిగిలిన రంగాలన్నీ అభివృద్ధి దిశలో పరుగులు తీస్తాయని నాటి ప్రధానమంత్రి వాజ్పాయ్ ని ఒప్పించి దేశం నాలుగు దిక్కులు కలుపుతూ సిక్స్ లైన్స్ రోడ్ల స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టటానికి చంద్రబాబు నాయుడు కృషే కారణం అని అలాంటి గొప్ప నాయకుడు కక్షపూరితమైన స్వార్థ రాజకీయాలకు గురై రిమాండ్ ఖైదీగా జైలులో ఉంచటం దారుణమన్నారు. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, రైల్వేలు తదితర ప్రభుత్వ రంగ ఆస్తులన్నీ దేశ సంపదలని, అదేవిధంగా సమాజ అభివృద్ధిలో ఎనలేని పాత్ర పోషించిన ఎన్టీఆర్, అబ్దుల్ కలాం, చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప వ్యక్తుల తెలివితేటలు కూడా జాతి సంపదేనని తెలిపారు. రాష్ట్ర, దేశాభివృద్ధికి పాటుపడిన చంద్రబాబుని అరెస్టు చేసి పైశాచిక ఆనందం పొందటం దురదృష్ట కరమని, విడుదల అయ్యేంతవరకు సమిష్టిగా పోరాడుతామని తెలిపారు. సమిష్టిగా ఈ దౌర్భాగ్య ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఎదుర్కోవాలని పిలుపుని ఇచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన గొప్ప విజన్ ఉన్న నాయకుడిని ఈ విధంగా అరెస్ట్ చెయ్యడం రాక్షస కృత్యం అని,దీనిని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. జాతీయ సంపదైన చంద్రబాబు చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసనలు తెలిపేందుకు మనమందరం కలవాల్సి రావటం బాధాకరమైన విషయమని, జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. అభివృద్ధిని నీతిని అణచి వేయడానికి ప్రస్తుతం ముఖ్యమంత్రి అండ్ కో చేయని ప్రయత్నం లేదన్నారు.రాష్ట్రం లోని అన్ని నదులను, ప్రాజెక్టులు అనుసంధానించి అభివృద్ధి చేయడం ఆయన చేసిన తప్పా... అమరావతిని వేగవంతంగా నిర్మించడం ఆయన చేసిన తప్పా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి పొరపాటు లేకపోయినా ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేని ప్రభుత్వ దుశ్చర్యను ప్రశ్నిస్తూ మనందరం చంద్రబాబుకు అండగా నిలబడదా మన‌్నారు. గొప్ప నాయకుడైన చంద్రబాబును కనీస వసతులు లేని జైలులో ఉంచడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలోనే ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఒక్కరేనన్నారు. అలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దర్శి సంఘ సభ్యులు దిరిశాల రామకృష్ణ మాట్లాడుతూ దేశంలోనే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి గొప్ప స్థానంలో నిలిపిన చంద్రబాబు గారిని అరెస్టు చేయడం అన్యాయమని ఖండించారు. సాఫ్ట్వేర్ రంగానికి పునాదులు వేసి ఎంతోమంది పేద పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు . ఈ కార్యక్రమంలో పలువురు చంద్రబాబు చిన్ననాటి స్నేహితులు, సమకాలీకులు, సహోధ్యాయులు ,సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. వీరికి పలువురు యువత, మహిళలు, నాయకులు సంఘీభావం తెలిపారు.
Comments
Post a Comment