రిలే నిరాహార దీక్షను ప్రారంభించిన ఖమ్మం పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ రామనాధం..!

ఖమ్మం, త్రిశూల్ న్యూస్ :
ఖమ్మం తెలుగుదేశంపార్టీ కార్యాలయం ఎదుట తెలుగుదేపార్టీ శ్రేణులు, నాయకులు కార్యకర్తల అధ్వర్యంలో జరిగే రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని డాక్టర్ రామనాథం ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ ను చేతిలో పెట్టుకొని ప్రతిపక్షాలపై అక్రమ అరెస్టులు చేపిస్తూ ఎక్కడ సభలు, ర్యాలీలు, పెట్టుకున్న దాడులు చేయిస్తూ రాజ్యాంగాన్ని పక్కన పెట్టీ సైకో చేష్టలతో ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగత పాలు చేస్తున్నారని, ఇలాంటి దుర్మార్గపు చర్యలను తెలుగు రాష్ట్రాలే కాక ఇతర పార్టీ నాయకులు సినీ తారలు తీవ్రంగా ఖండిస్తున్నారు అని అన్నారు.
అప్రజాస్వామ్యికంగా వ్యవహరించే జగన్ రెడ్డి లాంటి దుర్మార్గపు ముఖ్యమంత్రిని ఏ రాష్టంలో చూడలేదని, రాజకీయంగా, ప్రజాబలంతో ఎదుర్కొనే సత్తా లేక, అన్యాయపు కేసు పెట్టి అక్రమంగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నాడని, బాబు గారి పట్ల సైకో జగన్ రెడ్డి, ఆయన అనుచరులు చేస్తున్న దాడులకు వడ్డీతో సహా తిరిగి చెల్లించే రోజు దగ్గరలోనే వుందని, వైసీపీ గుండాలు మొత్తాన్ని ఊచలు లెక్క పెట్టిస్తామని హెచ్చరించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా, ప్రజా సంక్షేమం, అభివృద్ధికి చిరునామాగా వున్న దార్శనికుడు చంద్రబాబు అక్రమ నిర్బంధాన్ని ప్రజాస్వామ్యులందరా ముక్తకఠంతో ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం టిడిపి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షుడు కొండబాల కరుణాకర్, ప్రధాన కార్యదర్శి కేతినేని హరీష్, ఐటిడిపి అధికార ప్రతినిధి ఆకారపు శ్రీనివాస్, లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెంపాటి అప్పారావు, పాల్వంచ రామారావు, అడ్వకేట్ కొలికొండమురళి, బి.వి.రాగవులు, టిడిపి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు చుండూరి రాజేశ్వరి, నాగార్జున శ్రీను, పాలడుగు క్రిష్ణప్రసాద్ ,పృధ్వీ, కూచిపూడి జై చౌదరి , నాగండ్ల లక్ష్మణ్, చండ్ర రవి, ఖమ్మం పార్లమెంటరీ తెలుగు మహిళా కమిటీ అధ్యక్షురాలు మందపల్లి రజని, ప్రధాన కార్యదర్శి కామ అనితా, మేడేపల్లి రమాదేవి, మాజీ సర్పంచ్ ,చావా రామారావు , మీగడ రామారావు, చింతనిపు నాగేశ్వరరావు, వాడపల్లి బిక్షపతి, టీవి రాజు, బైరు అప్పారావు, లేళ్ల లక్ష్మణ్, మంకేన శ్రీనివాస్, చావ అజయ్, ఐటిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేమూరి సునీల్, మధిర టౌన్ టిడిపి కార్యదర్శి చెరుకూరి కృష్ణారావు, కండపనేని రత్నాకర్ రావు, నున్నా తాజుద్దీన్ , చిరుమామిళ్ల రవి, తదితర నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు