Posts

Showing posts from December, 2023

ఆడుదాం ఆంధ్రా ఇది అందరి ఆట - కెఆర్జె దుర్గమ్మ

Image
శాంతిపురం, త్రిశూల్ న్యూస్ :  మట్టిలో మాణిక్యాలైన గ్రామీణ క్రీడాకారులను గుర్తించి వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడమే ఆడుదాం ఆంధ్రా లక్ష్యమని చిత్తూరు ఎమ్మెల్సి కె ఆర్ జె భరత్ సతీమణి దుర్గమ్మ అన్నారు. శాంతిపురం మండలం చెల్దిగానిపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘ఆడుదాం ఆంధ్రా’’ పోటీలను బుధవారం దుర్గమ్మ ప్రారంభించారు. క్రీడాకారులు గౌరవ వందనం, క్రీడా ప్రతిజ్ఞ అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రికెట్,వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన "ఆడుదాం ఆంధ్ర" కార్యక్రమం ద్వారా గ్రామీణ స్థాయిలో వివిధ నైపుణ్యాలు కలిగిన వారిని ఎంపిక చేసి వారిని మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గత పాలకులు విద్యకు, ఆటలకు అధిక ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. సీఎం జగనన్న విద్యా వ్యవస్థకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు. ఆడుదాం ఆంధ్రా ఆటలపోటీలను విద్

నేటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటన..!

Image
కుప్పం, త్రిశూల్ న్యూస్ : టీడీపీ అధినేత చంద్రబాబు నేటి నుంచి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆయన తన సొంత నియోజకవర్గంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. నేడు (28.12.2023) ఉదయం 9.30కి బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి 10.40కి బెంగళూరుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు కె.ఎమ్.ఎమ్ రాయల్ కన్వెన్షన్లో బెంగళూరు టీడీపీ ఫోరమ్ అద్వర్యంలో నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొంటారు. అనంతరం, రోడ్డుమార్గం ద్వారా బయలుదేరి సాయంత్రం 4 గంటలకు గుడుపల్లె ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 6 గంటలకు టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో భేటీకానున్నారు. రాత్రి 8.45కి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో బస చేయనున్నారు. రేపు (29.12.2023) ఉదయం 11 గంటల 50 నిమిషాలకు శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రామకుప్పం పోలీస్ స్టేషన్‌ సెంటర్‌లో బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు కుప్పంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జనసేన నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు ఓ కన్వెన్షన్ హాల్‌లో టీడీ

చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయండి - టి. ఎం. బాబు నాయుడు

Image
గుడుపల్లె, త్రిశూల్ న్యూస్ :  తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, కుప్పం ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటించునున్న నేపథ్యంలో ఆయన పర్యటనను విజయవంతం చేయాలని గుడుపల్లె మండల టిడిపి అధ్యక్షులు టి. ఎం. బాబు నాయుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నేడు బెంగళూరు మీదుగా సరిహద్దు ప్రాంతం బిసానత్తం వద్దకు 2 గంటలకు చేరుకుంటారని తెలిపారు. అనంతరం గుడుపల్లె బస్టాండు నందు జరిగే బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. ఈ బహిరంగ సభకు మండలంలోని టిడిపి నాయకులు,  తెలుగు యువత, ఐ టిడిపి, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, టిడిపి అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సభను జయప్రదం చేయాలని అయన ఈ సందర్బంగా కోరారు.

వైనాట్ 175.. చంద్రబాబును కలవర పెడుతోందా..?

Image
- కుప్పంలో వరుస పర్యటనలు చేస్తున్న బాబు - స్థానిక నాయకుల పని తీరుపై బాబు ఆందోళన చెందుతున్నాడా? - రానున్న ఎన్నికల్లో లక్ష మెజారిటీ లక్ష్యంపై చంద్రబాబు ఆశలు కుప్పం, త్రిశూల్ న్యూస్ : వైనాట్ 175 అనే నినాదం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రకటించాడో ఇక అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత, కుప్పం ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడును కలవరపెడుతోందా? మునుపు ఎన్నడూ లేని విధంగా గత రెండేళ్ల నుండి వరుసగా కుప్పంలో పర్యటిస్తూ స్థానిక నాయకులతో పాటు పార్టీ కేడర్ ను జాగృతి చేస్తున్నారు. గత 5ఎన్నికల్లో కూడా లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంతో బరిలోకి దిగలేదు కానీ 2024లో జరగబోయే ఎన్నికలను మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ కేడర్ ను నిత్యం ప్రజల్లో ఉండేలా దిశా నిర్దేశం చేశారు. ఎన్నికలు జరిగే ప్రతి సారి చంద్రబాబు తరుపున స్థానిక నేతలే ఎన్నికల నామినేషన్ వేసేవారు. అలాంటిది ఇప్పుడు కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ద చూపుతుండడంతో రాజకీయ విశ్లేషకులకు సైతం చంద్రబాబు రాజకీయ చతురత అర్ధం కాని పరిస్థితి నెలకొంది.       చిత్తూరు జిల్లా కుప్పం 1989కి ముందు రాష్ట్రంలో ఎవరికీ తెలియని ఓ నియోజకవర్గం. తెల

రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించలేని సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు..!

Image
- కార్మికుల సమస్యలను తక్షణం పరిష్కరించాలి  - పిసిసి ప్రధాన  కార్యదర్శి గౌడపేర చిట్టిబాబు డిమాండ్  తిరుపతి, త్రిశూల్ న్యూస్ : ఎన్నికలకు ముందు ఓట్ల కోసం స్కీం వర్కర్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు, ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి వాటిని పరిష్కరించలేని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతారని పిసిసి కార్యదర్శి గౌడపేర చిట్టిబాబు విమర్శించారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుపతిని వాటికన్ సిటీగా అభివృద్ధి చేశామని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి చెప్పడం హాస్యాస్పదమన్నారు. రోడ్లు వేసి డివైడర్లకు రంగులు, బొమ్మలు వేసినంత మాత్రాన తిరుపతి వాటికన్ సిటీ అవుతుందా అని ప్రశ్నించారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయింపు, వాహన బ్యానర్లకు, కళ్యాణ కట్ట పీస్ రేట్ బార్బర్లకు జీతాల పెంపు, శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలతో ఇచ్చిందే తప్ప ప్రభుత్వం పెంచింది కాదని చెప్పారు. తిరుపతిలో అభివృద్ధి సైతం టీటీడీ భాగస్వామి అయ్యింది కాబట్టి పురోగతి కనిపిస్తోందని ఇది ప్రభుత్వం ద్వారా జరిగింది కాదని తెల

తెలుగునాడు ప్రొఫైషనల్స్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా డా. వెంకటేష్ నియామకం..!

Image
కుప్పం, త్రిశూల్ న్యూస్ : తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం తెలుగునాడు ప్రొఫైషనల్స్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా డా. వెంకటేష్ ను నియమించినట్లు కుప్పం పార్టీ కార్యాలయం ఓ ప్రకటన ద్వారా పేర్కొంది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు పార్లమెంట్ వన్నెకుల క్షత్రియ సాధికార కమిటి అధ్యక్షులుగా డా. ఎం. కృష్ణ, ఉపాధ్యక్షులుగా మణిలను ఎంపిక చేశారు. విరితో పాటు కుప్పం నియోజకవర్గ వన్నికుల క్షత్రియ సాధికార కమిటీ అధ్యక్షునిగా రుద్రప్ప, నియోజకవర్గ యువత అధ్యక్షునిగా సతీష్, కుప్పం మండలం అధ్యక్షునిగా ప్రకాష్, గుడుపల్లె మండల అధ్యక్షునిగా శ్రీనివాసులు, కుప్పం టౌన్ అధ్యక్షునిగా నాగేంద్ర, శాంతిపురం మండల అధ్యక్షునిగా గోవింద రాజులు, రామకుప్పం మండల అధ్యక్షునిగా జేయీ లను కుప్పం నియోజకవర్గ వన్నికుల క్షత్రియ సాధికార కమిటీని ఎంపిక చేసినట్లు పార్టీ కార్యాలయం పేర్కొంది.

మూడు రోజులు కుప్పంలో చంద్రబాబు పర్యటన..!

Image
కుప్పం, త్రిశూల్ న్యూస్ : తెలుగుదేశం పార్టీ అధినేత స్థానిక ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటన నిమిత్తం కుప్పం రానున్నారు. ఈ నెల 28,29,30 తేదీల్లో చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించునున్నారు. స్కిల్ డౌల్మెంట్ కేసులో చంద్రబాబు జైలు నుంచి వచ్చిన తరువాత మొదటి సారిగా కుప్పం రానున్నారు. బాబు పర్యటన విజయవంతం కోసం తెదేపా శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.