వైనాట్ 175.. చంద్రబాబును కలవర పెడుతోందా..?

- కుప్పంలో వరుస పర్యటనలు చేస్తున్న బాబు

- స్థానిక నాయకుల పని తీరుపై బాబు ఆందోళన చెందుతున్నాడా?

- రానున్న ఎన్నికల్లో లక్ష మెజారిటీ లక్ష్యంపై చంద్రబాబు ఆశలు
కుప్పం, త్రిశూల్ న్యూస్ :
వైనాట్ 175 అనే నినాదం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రకటించాడో ఇక అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత, కుప్పం ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడును కలవరపెడుతోందా? మునుపు ఎన్నడూ లేని విధంగా గత రెండేళ్ల నుండి వరుసగా కుప్పంలో పర్యటిస్తూ స్థానిక నాయకులతో పాటు పార్టీ కేడర్ ను జాగృతి చేస్తున్నారు. గత 5ఎన్నికల్లో కూడా లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంతో బరిలోకి దిగలేదు కానీ 2024లో జరగబోయే ఎన్నికలను మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ కేడర్ ను నిత్యం ప్రజల్లో ఉండేలా దిశా నిర్దేశం చేశారు. ఎన్నికలు జరిగే ప్రతి సారి చంద్రబాబు తరుపున స్థానిక నేతలే ఎన్నికల నామినేషన్ వేసేవారు. అలాంటిది ఇప్పుడు కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ద చూపుతుండడంతో రాజకీయ విశ్లేషకులకు సైతం చంద్రబాబు రాజకీయ చతురత అర్ధం కాని పరిస్థితి నెలకొంది.


      చిత్తూరు జిల్లా కుప్పం 1989కి ముందు రాష్ట్రంలో ఎవరికీ తెలియని ఓ నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ ఆవిర్బావం తరువాత 1989ఎన్నికల్లో కుప్పం నుంచి ఎమ్మెల్యేగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తూ కుప్పం నియోజకవర్గ స్థాయిని గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకెళ్లిన ఘనత ఒక్క బాబుకు మాత్రమే దగ్గుతుంది అనడంలో సదేహం లేదు. అంతటి ఖ్యతిని సంపాదించుకున్న చంద్రబాబు ఇప్పుడు వైనాట్ 175 నినాదానికి ఎందుకు బయపడుతున్నట్టు.? గత నాలుగు ఎన్నికల సరళని చూస్తే 2004లో 59,588 మెజార్టీ, 2009లో 46,006 మెజారిటీ, 2014లో 47,121 మెజారిటీ, 2019లో 30,722 మెజారిటీతో విజయం వరించింది. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న కుప్పానికి దేశ చిత్రపటంలో ఓ స్థానం కల్పించిన చంద్రబాబుకు పూర్తి స్థాయిలో ఓటు బ్యాంకు రావాలి. కానీ ఎందుకు రావడం లేదన్నది ఆయనకు కూడా అర్ధం కానీ విషయమే. పార్టీ అన్నాక లోటుపాట్లు సహజమే కానీ కుప్పం నియోజవర్గాన్ని విద్యారంగంలో, వ్యవసాయ రంగంలో, వైద్య రంగంలో, పేదలకు గృహాలు, రహదారులు, చెరువులు, ప్రాజెక్టులు ఇలా చెప్పుకుంటూ పొతే చాలానే ఉన్నాయి. అయినా కూడా కుప్పం ప్రజలు చంద్రబాబుకు ఓటు ఎందుకు వేయడం లేదు ప్రతి ఒక్కరి నోటా ఇదే మాట. కుప్పం వచ్చిన ప్రతి సారి కుప్పంలో ఎం జరుగుతుందో నాకు అంతా తెలుసు అంటారు. పర్యటన అయిన తరువాత ఇక్కడ ( ఎవరికి వారే ఎమ్మెల్యే లెవల్లో ) మళ్ళీ చలామని సాగించడం పరిపాటగా మారింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చూస్తాం ఎం. చేస్తాం అని చెబుతూ కాలం వెళ్ళాదిస్తారు. అధికారంలో లేకపోతే మాత్రం మన ప్రభుత్వం వచ్చిన తరువాత చేస్తాం అని ప్రజలకు చెప్పండం షరా మాములు అయిపొయింది. ఇక టిడిపి ద్వితీయ శ్రేణి కార్యకర్తలను పట్టించుకునే నాధుడే కరువాయే. వారు పార్టీ, చంద్రబాబుపై ఉన్న అభిమానంతో ఓపిక పడుతున్నారు తప్ప స్థానిక నేతల మీద ఉన్న నమ్మకంతో కాదు అన్నది జగమెరిగిన సత్యం. కుప్పం నియోజకవర్గంలోని స్థానిక నేతలకు. దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదు అన్న చందంగా మారింది స్థానిక నాయకత్వం తీరు. దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దొరస్వామి కుమారుడు, డాక్టర్ గా అందరికి సుపరిచితుడైన సురేష్ బాబును పార్టీలోకి ఆహ్వానించి బాధ్యతలు అప్పగించారు. పట్టుభద్రుల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్సి కంచెర్ల శ్రీకాంత్ ను కుప్పం నియోజకవర్గానికే పరిమితం చేసి ఎప్పటికప్పుడు కుప్పంలో జరిగే ప్రతి విషయంపై పోకస్ పెట్టారు చంద్రబాబు.
లక్ష్య మెజారిటీ లక్ష్యం సాధ్యమేనా.?

       వరుస విజయాలతో కుప్పంను పెట్టని కోటగా మార్చుకున్న చంద్రబాబును ఓడించాలని వైసిపి కసిగా పని చేస్తోంది. గత ఎన్నికల్లో 30 వేల మెజారిటీతో చంద్రబాబు గెలుపొందారు. అంతకుముందు ఎన్నికల్లో 40 వేల మెజారిటీకి పైనే చంద్రబాబు సాధిస్తూ వచ్చారు. కానీ గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో మెజారిటీ తగ్గింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రత్యేకంగా కుప్పం నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అయితే పూర్తిస్థాయిలో పట్టు సాధించిన పెద్దిరెడ్డి.. టిడిపి కేడర్ను వైసీపీ వైపు టర్న్ అయ్యేలా పావులు కదిపారు. స్థానిక సంస్థలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు సాధించారు. అప్పటి నుంచే వై నాట్ కుప్పం అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. కుప్పంను ప్రత్యేక రెవెన్యూ డివిజన్ గా ప్రకటించడంతో పాటు మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఇవన్నీ కలిసి వస్తాయని వైసిపి భావిస్తోంది. అయితే చంద్రబాబుతో పాటు టిడిపి నేతల్లో ఒక రకమైన కలవరపాటు కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు తరచూ కుప్పం పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ మధ్య కాలంలో కుప్పం చంద్రబాబు పర్యటన సమయాల్లో వైసీపీ శ్రేణులు అడ్డు తగులుతూనే ఉన్నాయి. మరోవైపు భరత్ కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన జగన్.. ఎమ్మెల్సీ పదవిని కూడా ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో భరత్ ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే మంత్రి పదవి ఇస్తానని కూడా జగన్ ప్రకటించారు. అయితే కుప్పంలో చంద్రబాబును ఓడించడం అంత తేలిక పని కాదని జగన్ కు తెలుసు. అయినా సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో జగన్ చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే అదంతా ఉత్తమాటేనని.. కుప్పం నుంచి మరోసారి చంద్రబాబు బరిలో దిగడం ఖాయమని.. అత్యధిక మెజారిటీతో గెలుపొందుతారని టిడిపి శ్రేణులు చెబుతున్నాయి. జగన్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత ఉన్న దృష్ట్యా.. చంద్రబాబుకు రికార్డ్ స్థాయిలో మెజారిటీ ఖాయమని నమ్మకంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల పర్యటనలో నేతలకు, కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారనేది చూడాలి.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు