ఆడుదాం ఆంధ్రా ఇది అందరి ఆట - కెఆర్జె దుర్గమ్మ

శాంతిపురం, త్రిశూల్ న్యూస్ :
 మట్టిలో మాణిక్యాలైన గ్రామీణ క్రీడాకారులను గుర్తించి వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడమే ఆడుదాం ఆంధ్రా లక్ష్యమని చిత్తూరు ఎమ్మెల్సి కె ఆర్ జె భరత్ సతీమణి దుర్గమ్మ అన్నారు. శాంతిపురం మండలం చెల్దిగానిపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘ఆడుదాం ఆంధ్రా’’ పోటీలను బుధవారం దుర్గమ్మ ప్రారంభించారు. క్రీడాకారులు గౌరవ వందనం, క్రీడా ప్రతిజ్ఞ అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రికెట్,వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన "ఆడుదాం ఆంధ్ర" కార్యక్రమం ద్వారా గ్రామీణ స్థాయిలో వివిధ నైపుణ్యాలు కలిగిన వారిని ఎంపిక చేసి వారిని మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గత పాలకులు విద్యకు, ఆటలకు అధిక ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. సీఎం జగనన్న విద్యా వ్యవస్థకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు. ఆడుదాం ఆంధ్రా ఆటలపోటీలను విద్యార్థులందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు, విద్యార్థులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు