కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!
కుప్పం, త్రిశూల్ న్యూస్ :
ఒకటి రెండు నెలలు కాదు ఏకంగా ఏడు నెలల జీతాల కోసం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇన్నాళ్లు ఎదురు చూసారు. అయినా ద్రావిడ విశ్వవిద్యాలయ అధికారుల్లో చలనం లేకపోవడంతో రేపు వర్సిటీ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఔట్ద్ సోర్సింగ్ ఉద్యోగులు. మాట్లాడుతూ గత ఏడు నెలలుగా జీతాలు ఇవ్వక వెట్టి చాకిరీ చేస్తున్న కూడా అధికారుల్లో స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. గత 15రోజులుగా విధులకు హాజరు అవుతూనే వర్సిటీ జీతాల కోసం గంట పాటు పరిపాలన భవనం ఎదుట నిరసన చేసిన ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తమ 7 నెలల వేతనాలకోసం రేపు వర్సిటి బంద్ కు పిలుపునిచ్చామని పేర్కొన్నారు. కావున ప్రతి ఒక్కరు తమ బంద్ కు మద్దతు ఇవ్వాలని ఈ సందర్బంగా ఉద్యోగులు కోరారు.
Comments
Post a Comment