ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు
- 9నెలలుగా అందని జీతభత్యాలు.. రెండు నెలలుగా నిరసనలో ఉద్యోగులు
- నిరసన సమయంలో ఉద్యోగులపై ఓ మహిళా అటెండర్ చిందులు
- గుడుపల్లె పోలీస్ స్టేషన్ లో పరస్పరం పిర్యాదులు
కుప్పం, త్రిశూల్ న్యూస్ :
ఇచ్చేది అరకొర జీతాలు.. అందులోనూ సమయం సందర్బం లేని పనివేళలు.. కనీస వేతనానికి కూడా నోచుకోక ఇచ్చిందే పుచ్చుకుని ఇంతకాలం ఏదోలా కాలం వెళ్ళదీసిన కాట్రాక్ట్ ఉద్యోగులకు గత 9నెలలుగా జీతలు చెల్లించలేదు ద్రావిడ యాజమాన్యం. దింతో కడుపు మండిన ఉద్యోగులు శాంతియుతంగా తమకు అప్పగించిన సమయంలో పని చేస్తూ మధ్యాహ్నం 12నుంచి 1గంట సమయంలో మాత్రం గత మూడు నెలలుగా నిరసన తెలియజేస్తున్నారు. అయినా కూడా ద్రావిడ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, రిజిస్టర్ లు పట్టించుకోకపోవడంతో కడుపు మండిన ఉద్యోగులు సోమవారం సాయంత్రం మంగళవారం నుండి నిరవదిక నిరసనకు పిలుపునిస్తూ వర్సిటీ అధికారులకు రాతపూర్వకంగా తెలియజేసినట్లు ఉద్యోగులు తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సుమారు 220 విధులకు హాజరు కాకుండా నిరసనలో పాల్గొన్నామని.. తమిళ డిపార్ట్మెంట్ లో అటెండర్ గా పనిచేస్తున్న ఓ మహిళ విధులకు హాజరు కావడంతో తోటి మహిళా ఉద్యోగులు జీతాల కోసం అందరం కలసి నిరసన మీరు మాత్రం ఇలా విధులకు హాజరు అవుతారని ప్రశ్నించామని పేర్కొన్నారు. దింతో తోటి మహిళా ఉద్యోగులని కూడా చూడకుండా దురుసుగా మాట్లాడుతూ తమ నిరసన కార్యక్రమాన్ని హేళన చేస్తూ ఇష్టారాజ్యాంగ మాట్లాడినట్లు చెప్పారు. ఇంతలోనే ఆమె రోడ్డుపై పడిపోయి మేము ఏదో చేశామని పోలీసులకు పిర్యాదు చేసినట్లు తెలిపారు. దింతో సుమారు 200మంది గుడుపల్లె పోలీస్ స్టేషన్ చేరుకొని ద్రావిడ వర్సిటీ రిజిస్టర్ కు తొత్తుగా మహిళా అటెండర్ వ్యవహరిస్తూ తమ నిరసనను హేళన చేయడమే కాకుండా తమపై అక్రమంగా కేసులు పెట్టి తమను బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ సందర్బంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా విధులకు హాజరైనా కూడా ద్రావిడ యాజమాన్యం మాపై కనికరం చూపకుండా జీతాలు అందించక పోవడం బాధాకరం అన్నారు. తమ సమస్యను ఉన్నతధికారుల ద్రుష్టికి, ప్రభుత్వం ద్రుష్టికి తీసుకోకపోకుండా మమల్ని మానసికంగా ఇబ్బందులు పెట్టడం బాధాకరమని పేర్కొన్నారు.
Comments
Post a Comment