వాట్సాప్ వినియోగదారులకు తిరుపతి జిల్లా పోలీసుల హెచ్చరిక..! - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

December 21, 2025

వాట్సాప్ వినియోగదారులకు తిరుపతి జిల్లా పోలీసుల హెచ్చరిక..!

- ‘ఘోస్ట్ పేయిరింగ్’ సైబర్ స్కామ్‌కు అప్రమత్తంగా ఉండాలి
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు సూచనల మేరకు తిరుపతి జిల్లా ప్రజలకు, ముఖ్యంగా వాట్సాప్ వినియోగదారులకు ఇటీవల సైబర్ మోసాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా పోలీస్ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది.

- వాట్సాప్‌లో “Hey… మీ ఫోటో చూశారా?”,

- “ఇది నువ్వేనా?” అంటూ వచ్చే ఏవైనా సందేశాలు అవి మనకు తెలిసిన వ్యక్తుల పేరు, ఫోటో (DP)తో వచ్చినప్పటికీ, ఏ పరిస్థితుల్లోనూ లింక్‌పై క్లిక్ చేయరాదని పోలీస్ శాఖ స్పష్టం చేసింది.

- సాధారణంగా పరిచయం ఉన్న వారి పేరు, ప్రొఫైల్ ఫోటో కనిపించడంతో నమ్మేసే మనస్తత్వాన్ని సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

- ఈ తరహా సందేశాల్లో ఉన్న లింకులు “ఘోస్ట్ పేయిరింగ్” (Ghost Pairing) సైబర్ స్కామ్‌కు సంబంధించినవని హెచ్చరించారు.

- ఈ సైబర్ మోసం ఎలా జరుగుతుంది? లింక్‌పై క్లిక్ చేస్తే నకిలీ WhatsApp Web లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో వివరాలు ఎంటర్ చేస్తే వాట్సాప్ అకౌంట్ పూర్తిగా హ్యాకర్ల నియంత్రణలోకి వెళ్లిపోతుంది.

- అనంతరం హ్యాకర్లు బాధితుడి పేరుతో ఇతరులకు మెసేజ్‌లు పంపుతూ డబ్బు డిమాండ్ చేయడం, మోసాలకు పాల్పడడం జరుగుతుంది.

- జిల్లా ఎస్పీ గారి కీలక సూచనలు తెలియని లేదా అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు.

- తెలిసిన వ్యక్తుల పేరుతో వచ్చినా ముందుగా ఫోన్ చేసి లేదా ప్రత్యక్షంగా వెరిఫికేషన్ చేసుకోవాలి.

- అకౌంట్ హ్యాక్ అయినట్టు అనుమానం వచ్చిన వెంటనే సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయాలి.

- స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు మరింత చాకచక్యంగా జరుగుతున్నాయని, ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

- డిజిటల్ భద్రత ఇప్పుడు వ్యక్తిగత భద్రతతో సమానమని, చిన్న అజాగ్రత్త పెద్ద నష్టానికి దారి తీస్తుందని తిరుపతి జిల్లా ఎస్పీ గారు ప్రజలకు మరోసారి గుర్తు చేశారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages