- ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ చిత్ర పటంలో నిలపడమే లక్ష్యంగా పని చేస్తున్నారు
- ఎన్డీఏ సర్కార్ సహకారంతో నవ్యాంధ్ర సాధనకు పాటు పడుతున్నారు
- ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబుకు సాదర స్వాగతం పలికిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు
న్యూడిల్లీ, త్రిశూల్ న్యూస్ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ చిత్ర పటంలో నిలపడమే లక్ష్యంగా.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్య శ్రామికులుగా పనిచేస్తున్నారని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు కొనియాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో నవ్యాంధ్ర సాధనకు పాటు పడుతున్నారని తెలిపారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం దేశ రాజధాని హస్తినకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, కేంద్ర మంత్రులు, ఏపీ కూటమి ఎంపీల బృందంతో కలిసి సాదర స్వాగతం పలికారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో ముందుకు సాగుతోందని చెప్పారు.చంద్రబాబు నాయుడు కృషితో ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయనీ, ఇప్పటికే 13 లక్షల 26 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని ఆయన తెలిపారు.చంద్రబాబు తన పట్టుదల ఓపికతో రాను అన్న పారిశ్రామికవేత్తలనే ఏపీలో పెట్టుబడులు పెట్టేలా చేశారనీ.. ఆయన చిత్తశుద్ధే దీనికి నిదర్శనం అన్నారు.ఈ విషయాన్ని పారిశ్రామిక వేత్తలు స్వయంగా అనేక వేదికల మీద చెబుతున్నారని ఎంపీ దగ్గుమళ్ళ తెలియజేశారు.ఇప్పటికే సుమారు 50 కంపెనీలు రాష్ట్రానికి వచ్చి వాటి కార్యకలాపాలను ప్రారంభించాయనీ.., ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు మానసపుత్రిక విజన్ 2047 విజయాన్ని సూచిస్తుందన్నారు.

No comments:
Post a Comment