తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. చలికి పాఠశాల సమయాల్లో మార్పులు..! - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

December 18, 2025

తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. చలికి పాఠశాల సమయాల్లో మార్పులు..!

- కొత్త సమయం: ఉదయం 9:40 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు
హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ :
తెలంగాణలోని ఉత్తర జిల్లాల్లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా అటవీ ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు, గజగజ వణికించే చలిగాలుల కారణంగా పాఠశాలలకు వెళ్లే చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను పరిగణనలోకి తీసుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా విద్యా సంస్థల పనివేళలను మారుస్తూ గురువారం కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్ని రకాల విద్యా సంస్థలు మార్చిన సమయాలను పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పాత సమయం ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు.. కొత్త సమయం ఉదయం 9:40 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఉండేది. అయితే గత కొన్ని రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు 6°C నుంచి 7°C మధ్య నమోదవుతున్నాయి. ముఖ్యంగా భీంపూర్ మండలం అర్లి (టి) వంటి గ్రామాలు తీవ్ర చలి గుప్పిట్లో ఉన్నాయి. అదిలాబాద్‌తో పాటు పక్కనే ఉన్న కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇదే విధమైన సమయము ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages