వీకోటలో అంబేద్కర్ భవనం - కోటి రూపాయల కల నెరవేరేదెన్నడు? - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

September 08, 2026

వీకోటలో అంబేద్కర్ భవనం - కోటి రూపాయల కల నెరవేరేదెన్నడు?

- బేస్ మట్టంతో ఆగిన నిర్మాణం.. 18 పంచాయతీల దళితుల నిరీక్షణ

-  టీడీపీ హయాంలో రూ.1.10 కోట్లు మంజూరు - వైసీపీ హయాంలో పూర్తి నిర్లక్ష్యం - మళ్లీ టీడీపీ వచ్చినా కదలని పనులు
వి. కోట, త్రిశూల్ న్యూస్ :
చిత్తూరు జిల్లా వీకోట మండల కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. అంబేద్కర్ భవనం నిర్మిస్తారా లేదా అనే ప్రశ్న ప్రశ్నార్థకంగానే మిగిలిపోతోంది.2018-19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం వీకోట మండలంలో అంబేద్కర్ భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించి, నిర్మాణం కోసం ఏకంగా రూ.1 కోటి 10 లక్షలు నిధులు మంజూరు చేసింది. అధికారులు హడావుడిగా శంకుస్థాపన చేసి, బేస్ మట్టం (పునాది) వరకు పనులు పూర్తి చేశారు. ఆ తరువాత ఎటువంటి పరిస్థితిలో కూడా పనులు ముందుకు సాగలేదు.తరువాత వచ్చిన ప్రభుత్వం ఈ భవనాన్ని కనీసం పట్టించుకోలేదు. ఐదేళ్లు గడిచినా ఒక్క ఇటుక కూడా పడలేదు. ఇప్పుడు మరలా టీడీపీ ప్రభుత్వం వచ్చినా, ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. బేస్ మట్టం చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచి, భవనం శిథిలావస్థకు చేరుతోంది. 18 పంచాయతీల దళితుల ఆవేదన వీకోట మండలంలో18 పంచాయతీలలో దళితులు అత్యధికంగా ఉన్నారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతి, లేదా ఏదైనా దళిత చైతన్య సదస్సు, అవగాహన సమావేశం ఏర్పాటు చేసుకోవాలంటే సొంత భవనం లేదు. దీంతో ఎక్కడో ఒకచోట, ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో లేదా రోడ్డు పక్కన గుడారం వేసి సమావేశాన్ని ముగిస్తున్నారు. ఇది డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను అవమానించడమే.ప్రజల ప్రశ్నలు కోటి రూపాయల నిధులు ఏమయ్యాయి? అంబేద్కర్ భవనం ఎందుకు ఆగిపోయింది? రాజకీయ లబ్ధి కోసమా?
దళితులకు ఇచ్చిన హామీలు కేవలం ఎన్నికల హామీలేనా?ఈ భవనం ఎప్పుడు పూర్తవుతుంది?
స్థానిక దళిత యువకులు, మేధావులు మాట్లాడుతూ "అన్ని వర్గాలకు కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్స్ కట్టే ప్రభుత్వం, అంబేద్కర్ పేరు మీద భవనం కట్టడానికి ఎందుకు వెనుకాడుతోంది? ఇది వివక్ష కాదా?" అని ప్రశ్నిస్తున్నారు.ప్రజల డిమాండ్ ఇప్పటికైనా చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు, పలమనేరు ఎమ్మెల్యే గారు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు స్పందించి, ఆగిపోయిన అంబేద్కర్ భవన నిర్మాణ పనులను వెంటనే పున:ప్రారంభించి, నిధులు విడుదల చేసి, భవనాన్ని పూర్తి చేయాలని వీకోట మండల ప్రజలు, దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది కేవలం భవనం కాదు, 18 పంచాయతీల దళితుల ఆత్మగౌరవానికి ప్రతీక. దీన్ని కలగానే మిగిల్చేస్తారా లేక నిజం చేస్తారా అనేది ప్రస్తుత ప్రభుత్వం చేతుల్లోనే ఉంది.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages