- గ్రీవెన్స్ సెల్‌కు రాని అధికారులు
మార్కాపురం, త్రిశూల్ న్యూస్ :
మార్కాపురం జిల్లా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ మొదటి రోజే అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టింది. ఉదయం 11:00 గంటలు దాటినా సంబంధిత అధికారులు ఎవరూ రాకపోవడంతో,దూర ప్రాంతాల నుంచి ఆశలతో వచ్చిన అర్జీదారులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది.తమ భూములు,ఇళ్లు కోల్పోయి నష్టపరిహారం మరియు పునరావాసం కోసం ఏళ్ల తరబడి పోరాడుతున్న నిర్వాసితులకు ఊరట కలిగించేందుకు ఈ ప్రత్యేక గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేశారు.అయితే, బాధ్యతాయుతమైన జిల్లా స్థాయి అధికారులు సమయపాలన పాటించకపోవడంపై నిర్వాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కార్యాలయంలోనే అధికారుల తీరు ఈ విధంగా ఉంటే, ఇక మండల స్థాయి కార్యాలయాల్లో సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, గ్రీవెన్స్ సెల్ సజావుగా సాగేలా చూడాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

No comments:
Post a Comment