చంద్రబాబుకు 2024 చివరి ఎన్నికలు..!
- మంత్రి పెద్ద రెడ్డి రామచంద్రా రెడ్డి
చిత్తూరు, త్రిశూల్ న్యూస్:
2024 లో జరిగే ఎన్నికలు చంద్రబాబు నాయుడుకు కడపటి ఎన్నికలు అవుతాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రం నిర్వహించిన ఆజాద్ కా అమృత్ మహోత్సవం కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహానాడు కార్యక్రమం తర్వాత టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తున్నదని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు పెద్దిరెడ్డి స్పందించారు. అనంతపురంలో నిర్వహించిన సామాజిక న్యాయ గర్జన సభకు టిడిపి మహానాడు సభ కన్నా మూడింతలుగా జనం తరలి వచ్చారని తెలిపారు. ఏ కార్యకర్త అయిన ఆయా పార్టీలకు పట్టుగొమ్మగా ఉండాల్సిందేనని తెలిపారు. కానీ గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 151 స్థానాల్లో గెలుపొందడం జరిగిందని, అంతకంటే 2024 జరిగే ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలుపొందడం ఖాయమని తెలిపారు. చంద్రబాబుకు 2024 ఎన్నికలే కడపటి ఎన్నికల అవుతాయని జోస్యం చెప్పారు అనంతరం ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ టిడిపి నిర్వహించిన మహానాడు కార్యక్రమం వెన్నుపోటు కార్యక్రమం అని అది నయవంచకులు ఏర్పాటు చేసిన కార్యక్రమం అని విమర్శించారు. రాక్షస మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ ఒకటయ్యేందుకు మహానాడు వేదిక అయిందన్నారు. చంద్రబాబు నాయుడు పేదవాడు అయ్యాడని పార్టీ నాయకుల దగ్గర విరాళాలు సేకరించేందుకు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారని ఆరోపించారు. మహానాడు కార్యక్రమంలో పార్టీ లక్ష్యాలను ఉద్దేశాన్ని ప్రజలకు చెప్పిందేమి లేదని దుయ్యబట్టారు .
Comments
Post a Comment