బాలికపై గ్రామ వాలంటీర్ 3 నెలలుగా అత్యాచారం
- పోలీసులను ఆశ్రయించిన బాలిక తల్లిదండ్రులు
- నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు
బాపట్ల, త్రిశూల్ న్యూస్ :
బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో ఓ బాలికపై (15) గ్రామ వాలంటీర్ మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు ఉపాధి కోసం వేరే గ్రామంలో ఉంటున్నారు. అమ్మమ్మతో కలిసి బాలిక గ్రామంలో ఉంటోంది. వాలంటీర్‌గా పని చేస్తున్న వివాహితుడైన రావిపాటి కోటయ్య బాలికను బెదిరించి గత మూడు నెలలుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని బాధిత బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని చికిత్స కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Post a Comment