భార్యను హత్య చేసిన సాఫ్ట్ వేర్

- మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన భర్త..కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న వేణుగోపాల్ కు, తిరుపతికి చెందిన పద్మతో 2019లో వివాహం జరిగింది.పెళ్ళైన నాటి నుంచే భార్యాభర్తల మధ్య తరచూ చిన్న చిన్న గొడవలు జరిగేవి. ఈక్రమంలో భర్త వేణుగోపాల్ తో పొసగక.. పుట్టింటికి వచ్చింది పద్మ. అనంతరం ఇరు కుటుంబాల పెద్దలు కల్పించుకుని సర్ది చెప్పడంతో..ఈ ఏడాది జనవరిలో భార్యను కాపురానికి తెచ్చుకున్నాడు వేణుగోపాల్. అయితే ఇకపై పుట్టింటి వారితో కనీసం ఫోన్ లో నైనా మాట్లాడకూడదంటూ షరతు పెట్టాడు. ఈక్రమంలో గత నాలుగు నెలలుగా పద్మ నుంచి ఒక్కసారి కూడా ఫోన్ రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు..పోలీసులను ఆశ్రయించారు.దీంతో వేణుగోపాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా..పద్మను తానే హత్య చేసి ఆపై సూట్ కేసులో పెట్టి చెరువులో పడేసినట్టు అంగీకరించాడు. ఈ హత్య ఘటనలో సోమవారం తిరుపతి పోలీసులు వేణుగోపాల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పద్మను హత్య చేసి అనంతరం సూట్ కేసులో ఉంచి.. దాన్ని దుప్పట్లో చుట్టి.. తిరుపతి శివారులోని వెంకటాపురం చెరువులో పడేసినట్లు వేణుగోపాల్ విచారణలో వెల్లడించాడు. మంగళవారం చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు.. పద్మ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. అయితే భార్య పద్మను భర్త వేణుగోపాల్ ఎప్పుడు హత్య చేశాడు? ఎందుకు చేశాడనే విషయాలు తెలియాల్సి ఉంది.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు