ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ గా తిరుపతి
- డిజైన్లు విడుదల చేసిన రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్
తిరుపతి, త్రిశూల్ న్యూస్:
తిరుపతి రైల్వేస్టేషన్‌కు త్వరలో మహర్దశ పట్టనుంది. కాంట్రాక్టులన్ని పూర్తి చేశామని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. ఈ సందర్బంగా ఆయన డిజైన్లు కూడా విడుదల చేశారు. దేశంలోనే ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్లుగా తొలిదశలో అభివృద్ధి చేస్తున్న 14 రైల్వే స్టేషన్లలో తిరుపతి ఒకటి. ఈ 14 రైల్వే స్టేషన్లను 5 వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ ఇక ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్‌గా రూపాంతరం చెందనుంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశవ్యాప్తంగా భక్తులు అధికంగా రైల్వే ద్వారానే వస్తుంటారు. వేలాది భక్తులతో తిరుపతి రైల్వే స్టేషన్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. దేశ విదేశాల నుంచి కూడా పెద్దఎత్తున భక్తులు రావడంతో తిరుపతి రైల్వే స్టేషన్‌ను ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది.
Comments
Post a Comment